Varisu : విజయ్ వారిసు ట్రైలర్.. ఆ అంచనాలను అందుకుందా.!?

Varisu : తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా వారిసు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ పై ప్రేక్షకులకు భారీ అంచలే ఉన్నాయి.. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులు అల్లరించాయి.. తాజాగా వారిసు ట్రైలర్‌ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Vijay Varisu trailer beat that mark
Vijay Varisu trailer beat that mark

వారిసు ట్రైలర్ విడులై కొన్ని నిమిషాలే అయినా కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది.. ఈ సినిమా ను ట్రైలర్ లో కళ్లకు కట్టినట్టు చూపించాడు వంశీ. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. విజయ్ తన కుటుంబ పరువును కాపాడుకోవడానికి ఎలాంటి పరిణామాలను ఎదుర్కొనాల్సి వచ్చింది అనేది అసలు సినిమా కథ.

విజయ్ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. వారిసు సినిమాపై బాలయ్య , చిరంజీవి సినిమాలను తట్టుకొని నిలబడగలుగుతుందా అంటే ట్రైలర్ తో మాత్రం గట్టి పోటీని ఇచ్చారు.. ఇక సంక్రాంతి రేసులో ఎలాంటి విజయం వరిస్తుందో చూడాలి.