pawan Kalyan – vijay : అబ్బబ్బ కళ్ళు చెదిరిపోయే ఈవెంట్..! ఒకే స్టేజ్ పై సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు బడా స్టార్స్..!

pawan Kalyan – vijay : తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా వారసుడు టాలీవుడ్ లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుండగా.. అంతకుముందే ఘనంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు.. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించినట్లు సమాచారం.

Advertisement

Advertisement

విజయ్ పవన్ కళ్యాణ్ ఇద్దరికీ వారి వారి రాష్ట్రాలలో ఊహించని ఫ్యాన్ బెస్ ఉంది. ఇంకా చెప్పాలంటే కొందరు ఫాన్స్ వాళ్ళని దేవుడిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో విజయ్ పవన్ ఒకే స్టేజి పైన కనిపించడం అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుంది. నిజంగా పవన్ ఈ వేడుకకు హాజరైతే గనుక ఫ్యాన్స్ కు అంతకు మించిన ఆనందం ఉండదు. పైగా వారసుడు సినిమాపై కావలసినంత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు వైరల్ అవ్వగా పవన్ వస్తే అది వేరే లెవెల్ అనే టాక్ వినిపిస్తున్నాయి.

పవన్ రాకతో విజయ్ వారసుడు సినిమాకు భారీగా ఓపెనింగ్స్ పెరగొచ్చు అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈనెల 24 లో చెన్నైలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ తరువాత తెలుగులోనూ ఈ నెల 27న పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. ఈవెంట్ కు పవర్ స్టార్ వస్తే ఆ కిక్కే వేరప్పా అంటున్నారు సినీ అభిమానులు. పవన్, విజయ్ ఓకే స్టేజ్ పై కనిపిస్తే అది నిజంగా అబ్బబ్బ కళ్ళు చెదిరిపోయే ఈవెంట్. ఒకే స్టేజ్ పై సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు బడా స్టార్స్ వస్తారో రారో.. మరి ఏమవుతుందో చూడాలి.

Advertisement