Vijay Deverakonda : లైగర్ ప్లాప్.. విజయ్ దేవరకొండకి మళ్ళీ ఇంకో బొక్క..!!

Vijay Deverakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ఇమేజ్ కోసం సుమారు మూడు సంవత్సరాల పాటు కష్టపడి లైగర్ సినిమాలో నటించాడు.. ఈ సినిమాలో విజయ్ వన్ మాన్ షో తో నెట్టుకొచ్చాడు.. కానీ ఆశించిన ఫలితం రాలేకపోయింది టైగర్ సినిమాపై ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరిగాయి.. అందరూ సినిమా సూపర్ హిట్ అవడం ఖాయం అనుకున్నారు.. కానీ డిజాస్టర్ గా మిగిలింది.. ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు, బయర్లకు భారీగా నష్టాలను మిగిల్చింది.. ఇప్పుడు ఆ నష్టాలను భర్తీ చేయడంలో విజయ్ దేవరకొండ తన వంతు సాయం చేయనున్నాడు..

పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా ఇప్పటివరకు 50 శాతం వరకు కలెక్షన్లను వసూలు చేసింది మిగతా 50 శాతం మాత్రం నష్టాలను మిగిల్చింది అయితే ఈ 50 శాతం నష్టాలను భర్తీ చేయడానికి.. పూరి జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లు, బయార్లతో మాట్లాడి 30 శాతం పరిహారాన్ని చెల్లిస్తానని చెప్పాడు.. ఇక విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం సుమారు మూడు సంవత్సరాల పాటు తన సమయాన్ని కేటాయించాడు.. ఈ సినిమాకి విజయ్ 30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.. అయితే ఈ సినిమా నష్టాల్లోకి వెళ్లడంతో తన వంతుగా ఆరు కోట్లను ఇవ్వాలని అనుకున్నాడట..

Vijay Deverakonda return 6 crores on Puri Jagannadh on liger flap
Vijay Deverakonda return 6 crores on Puri Jagannadh on liger flap

ఇక అదే విషయాన్ని పూరీ జగన్నాథ్ కూడా చెప్పారట.. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం వచ్చి ఉంటే పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమా వచ్చుండేది కానీ ఈ సినిమా చేయట్లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. విజయ్ కి ఇప్పటికే లైగర్ సినిమా డిజాస్టర్ అవడం ఓ పెద్ద మైనస్ అయితే.. ఇప్పుడు జనగణమన కోల్పోవడం దానికి ఓ బోనస్.. దానితో పాటు విజయ్ ఆరు కోట్లు వెనక్కి ఇవ్వడం బొక్క కాక మరింకేమిటి అంటూ.. నేటిజెన్లు, పలువురు విజయ్ దేవరకొండ అభిమానులు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా డిస్కషన్ చేస్తున్నారు..

Advertisement