Salaar : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ కూడా నటిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఫాన్స్ కు తాజాగా ఒక వీడియో లీక్ అయ్యిందని చెప్పవచ్చు.. సలార్ సినిమాకు కొత్త షెడ్యూల్ షూటింగ్ ని తాజాగా ప్రారంభించడం జరిగింది. అయితే అందుకు సంబంధించి ఒక మేకింగ్ వీడియో తాజాగా లీక్ అవడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.
అయితే ప్రభాస్ లుక్ చూడడానికి చాలా సీరియస్ గా కనిపిస్తోంది. ఇక అంతే కాకుండా ఈ వీడియోలో మాస్ యాంగిల్ లో కనిపిస్తున్నట్లు తెలుస్తొంది అని ప్రభాస్ అభిమానులు కూడా చాలా కాలం నుంచి ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే తాజాగా లీక్ అయిన వీడియోలు చూసి ఫాన్స్ సైతం ఫిదా అవుతూ ఉన్నారు. అయితే ఈ వీడియోకు పలు రకాలుగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేస్తూ సోషల్ మీడియాలో ఈ వీడియోని పోస్ట్ చేస్తూ ఉన్నారు అభిమానులు. మొత్తానికి ఈ వీడియోతో ప్రభాస్ మరొకసారి వార్తల్లో నిలిచారని చెప్పవచ్చు.
ఇక ఇటీవల ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణించడంతో.. ప్రభాస్ ఒక వారం పాటు సినిమా షూటింగులకు బ్రేక్ ఇచ్చారు. ఇక ప్రభాస్ నిర్మాతలు ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతోనే తన పెదనాన్నకు చేయవలసిన కార్యక్రమాలను పూర్తి చేసిన వెంటనే తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.తాజాగా రామోజీ ఫిలిం సిటీ లో ఒక ప్రత్యేకమైన సెట్ లో సలార్ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఒక కీలకమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు అందుకు సంబంధించి ఒక వీడియో లీక్ అవ్వడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాత్రమే వైరల్ గా మారుతోంది. అంతేకాకుండా సలార్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. మలయాళం హీరో పృథ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం సలార్ సినిమా నుంచి లీకైన ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది.