Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొద్ది సంవత్సరాలుగా సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ నేపథ్యంలోనే గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో థియేటర్స్ లో సందడి చేసిన ఈయన.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు..అయితే ఈ సినిమా వచ్చి దాదాపు ఏడాది కావస్తున్న ఇప్పటివరకు మహేష్ బాబు నుంచి మరొక సినిమా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలోని ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన రిలీజ్ కి సిద్ధం కాబోతోంది. మరొకవైపు తన 29వ చిత్రాన్ని కూడా మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా లాంచింగ్ కూడా ప్రకటన రాబోతోంది. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తమిళ డైరెక్టర్ సినిమా తీయడమే కాదు బ్లాక్ బస్టర్ హిట్టు కూడా అందుకుంటాను అని తెలుపుతున్నారు. ఆయన ఎవరో కాదు తమిళ డైరెక్టర్ వెట్రిమారన్.
తాజాగా తెలుగు మీడియాతో ముచ్చటించినాయన దర్శకత్వం వహించిన విడుదల ప్రీమియర్ సందర్భంగా మాట్లాడుతూ మహేష్ ను ఆడుకాలం మూవీ రిలీజ్ తర్వాత కలిశాను కానీ ఆయనతో సినిమాకు సంబంధించిన కథ ఏది కుదరలేదు. కానీ రాబోయే రోజుల్లో తప్పకుండా సక్సెస్ఫుల్ మూవీ తీస్తాను అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు విడుదల సినిమా తెలుగు ఆడియోస్ని కూడా తప్పకుండా అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపోతే విడుదల మూవీని అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే