Varun Tej: మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ హీరో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఒకరు.. వరుణ్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.. నాగబాబు ఇచ్చిన ఇంటర్వ్యూతో మరోసారి వరుణ్ తేజ్ పెళ్లి విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అమ్మాయి ఎవరు అనేది ఇప్పుడు అందరి ప్రశ్న..!

నాగబాబు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వరుణ్ తేజ్ పెళ్లి విషయం గురించి ప్రశ్నించగా.. నాగబాబు ఆ విషయాన్ని తెలివిగా ఎస్కేప్ అవుతూ.. వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి చేసుకుంటాడని చెప్పగా.. అయితే ఆ అమ్మాయి ఎవరో చెప్పమని అడగగా.. ప్రస్తుతం ఆ వివరాలను నేను చెప్పను. వరుణ్ తేజ్ స్వయంగా చెప్పినప్పుడు మీకే అని తెలుస్తుంది అని మాట దాట వేశారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నాడని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.అయితే ఆ వార్తలు పై లావణ్య త్రిపాఠి స్పందిస్తూ.. ఆ వార్తలపై ఎలాంటి నిజం లేదని.. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చింది. దాంతో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మేటర్ క్లోజ్ అయింది.
.
కాగా.. మరోవైపు కాకుండా విక్టరీ వెంకటేశ్ చిన్న కూతురిని చేసుకుంటాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ విషయాలపై నాగబాబు స్పందించలేదు. వెంకటేష్ చిన్న కూతురు మెగా కోడలు కాబోతుందని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. కానీ మెగా కొడుకు దగ్గుపాటి ఇంటి అల్లుడు కనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే కోటీశ్వరుడు అయినట్టు వరుణ్ తేజ్ అంటూ మరో ప్రచారం జరుగుతుంది.