Varun Tej: కోటీశ్వరుడు కాబోతోన్న వరుణ్ తేజ్ , ఈ అమ్మయితోనే పెళ్లి — లెక్కలేనంత ఆస్తి ఉంది ఈ పిల్లకి !

Varun Tej: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.. వరుణ్ తేజ్ కూడా త్వరలో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నాడని నాగబాబు తెలిపారు. దాంతో మరోసారి వరుణ్ తేజ్ పెళ్లి విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

varun Tej married girl have lot of properties
varun Tej married girl have lot of properties

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన నాగబాబు.. ఈ విషయాన్ని తెలిపారు. వరుణ్ తేజే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తాడని.. అయితే ఆ అమ్మాయి ఎవరో చెప్పమని అడిగగా.. ప్రస్తుతం ఆ వివరాలను నేను చెప్పను. వరుణ్ తేజ్ స్వయంగా చెప్పినప్పుడు మీకే అని వరుణ్ తేజ్ పెళ్లి పై సస్పెన్స్ క్రియేట్ చేశారు నాగబాబు..

 

ఒకవైపు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నాడని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాకుండా విక్టరీ వెంకటేశ్ చిన్న కూతురిని చేసుకుంటాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ విషయాలపై నాగబాబు స్పందించలేదు.

వరుణ్ తేజ్ సినిమా హీరోయిన్ కాకుండా ఓ పారిశ్రామిక వేత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటాడని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. కొన్ని వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్న ఆ అమ్మాయిని వరుణ్ తేజ్ పెళ్లిచేసుకుంటాడని త్వరలోనే కోటీశ్వరుడు కాబోతున్నాడని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ ఉపాసనను చేసుకున్నట్లుగానే.. వరుణ్ తేజ్ కూడా కొన్ని వేల కోట్ల ప్రాపర్టీ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం . ఈ వార్తలో ఎంత నిజం ఉన్నది అనేది త్వరలోనే తెలుస్తుంది

వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమాలో నటిస్తున్నాడు. ఎస్వీసీసీ పతాకంపై తెరకెక్కుతున్న ఈ మూవీకి బాపినీడు బీవీఎస్ఎన్ ప్రసాద్లు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.