Vani Jayaram : ప్రముఖ గాయనిగా దాదాపు 20 వేల పాటలు పాడిన వాణీ జయరాం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల సినీ ఇండస్ట్రీకి ఈమె చేసిన సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అత్యున్నత రెండవ పురస్కారం అయిన పద్మభూషణ్ తో ఈమెను సత్కరించింది. దీంతో ఈమె పేరు మళ్లీ దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ఇదిలా ఉండగా ఎన్నో పాటలకు ప్రాణం పోసిన వాణీ జయరామ్ ఉన్నట్టుండి అనుమానాధాస్పద స్థితిలో మృతి చెందడం అందరినీ కలిచివేసింది. 72 సంవత్సరాల వయసులో ఆమె ఇలా మరణించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. వయోభారం లేదా అనారోగ్య కారణాలవల్ల చనిపోతే పెద్దగా అనుమానం ఉండదు కానీ ఈమెను ఎవరు కొట్టి చంపారు అంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.
వాణి జయరాం చనిపోయే ముందు ఆవిడ ముఖం మీద చాలా గాయాలు ఉన్నాయట. వాణి జయరాం ఇంట్లో పనిచేసే పనిమనిషి చెప్పిన వివరాల ప్రకారం.. ఆమె ఇంటి సీసీటీవీ ని పరిశీలించిన తర్వాత కొన్ని విసుపోయే విషయాలు బయటకు వచ్చాయని సమాచారం. ఉదయం 11 గంటలకు వాణీ జయరాం ఇంటి డోరు ఎంతసేపు కొట్టినా తీయలేదట . దాంతో పనిమనిషి చెన్నైలోని మైలాపూర్ లో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా తర్వాత కొంచెం సేపటికి బంధువులు వచ్చి డోర్ పగలగొట్టి చూసారు. అప్పుడు వాణీ జయరాం గాయాలతో టేబుల్ మీద ఉన్నారని తెలిపారు. ఆమె ముఖం మీద గాయాలు ఉన్నాయి కూడా ఎవరో కొట్టినట్లు గాయాలు ఉన్నాయని చూస్తే వాణీ జయరాం స్పృహలో లేరని తెలుస్తోంది.
ఇకపోతే హుటాహుటిన ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. అంతేకాదు ఇటీవల పోస్టుమార్టం నిర్వహించగా తలలో ఒక ఇంచు గాయం అయినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా ఎవరు చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు . ఏది ఏమైనా భారతదేశం ఒక గొప్ప గాయనిని కోల్పోయింది అని అభిమానులు మరింత చింతిస్తున్నారు.