Shruthi Hassan : మెగాస్టార్ చిరంజీవి శ్రుతి జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య.. శృతికి అందం ఎక్కువ చిరంజీవికి తొందర ఎక్కువ అంటే అవుననే విధంగా ఓ పాటను రూపొందించారు చిత్ర యూనిట్.. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది.. ఇంతలోనే ఈ సినిమాలోని 5వ సాంగ్ ను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. నీకేమో అందం ఎక్కువ నాకేమో తొందర ఎక్కువ అనే ఓ అందమైన డ్యూయెట్ మీ ఫ్రాన్స్ టౌలన్ లోని సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించారు..
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లలో మెగాస్టార్, శృతిహాసన్ బిజీగా ఉన్నారు. అయితే శృతిహాసన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ సీక్రెట్ ను రివిల్ చేసిందట. అదేంటంటే.. ఈ సినిమాలో మా ఇద్దరి రొమాన్స్ బాగుంటుందని.. వయసులో మాత్రం ఆయన నాకు తండ్రి లాంటివారు అంటూ మెగాస్టార్ కి పంచ్ వేసింది శృతిహాసన్. అయినా కానీ ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంటూ శృతి అంటూ హాట్ బ్రెడ్ పై నైస్ గా బట్టర్ రాసింది శృతి.. అంతేకాకుండా చిరంజీవి సెట్స్ లో చాలా సరదాగా ఉంటారంటూ.. ప్రతి ఒక్కరిని నవ్విస్తూ వాళ్ళ కి మెళుకువలు చెబుతారని శృతిహాసన్ చెప్పింది.. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి బాలయ్య నిలవనున్నారు. ఇక వాల్తేరు వీరయ్య ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తాడో చూడాలి.