Upasana Konidala : మెగా కోడలు ఉపాసన గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉపాసన రామ్ చరణ్ భార్య గానే కాకుండా.. అపోలో హాస్పిటల్స్ అధినేత మనవరాలుగా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ సామాన్యులకు అండగా నిలుస్తున్నారు. ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఏ పోస్ట్ అయినా సరే వైరల్ అవుతుంది తాజాగా ఆమె నెగిటివిటీ పై స్పందించారు.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ చాలా మంది నేను గోల్డెన్, ప్లాటినం స్పూన్ తో పుట్టాడని అనుకుంటారు. అయితే నా తల్లిదండ్రులు ఏ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారని.. నేను కూడా రెస్ట్ లేకుండా వృత్తిపరమైన బాధ్యతలతో బిజీగా ఉంటానని తెలిపారు. కావాలనుకుంటే నేను ఖాళీగా ఉండొచ్చు కానీ అలా ఉండలేదని నాకు తెలుసు ఏం చేయాలో ఏం చేయకూడదు నాకు తెలుసు అని అంటూ మాట్లాడారు..
నా గోల్స్ నాకు ఉన్నాయి హెల్త్ సెక్టార్స్ లో చేయాల్సింది చాలా ఉందని.. తన వంతుగా సమాజానికి చేయాల్సింది చేస్తానని అన్నారు.. నా గురించి నెగటివ్ గా రాసేముందు.. మొదట నిజాన్ని తెలుసుకోవాలని కోరారు. నెగిటివ్ కామెంట్స్ బాధిస్తాయని.. దయచేసి రాయకూడదు అంటూ రిక్వెస్ట్ చేశారు. నా పిల్లల్ని కూడా వృత్తిపరమైన బాధ్యతలతో నేను పెంచుతానని తెలిపారు. ఉపాసన చెప్పిన విషయాలు నెటిజన్ల ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉపాసన రామ్ చరణ్ కి పెళ్లి అయిన తర్వాత పది ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు. అయితే గతంలో ఉపాసన మీడియాతో మాట్లాడుతూ ఉండగా.. మీ పిల్లల గురించి అని ప్రశ్నించగా.. అది పూర్తిగా మా వ్యక్తిగత విషయమని .. మా నిర్ణయాలు మాకు ఉంటాయని.. మేము ఎప్పుడు కోరుకుంటే అప్పుడు అది చేస్తామని..ఈ విషయాన్ని పబ్లిక్ చేయొద్దు అంటూ ఉపాసన అప్పుడు మాట్లాడిన వీడియోను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు