Ram charan-Upasana : జపాన్ వీధుల్లో ఉపాసన..ఈ ఒక్క ఫోటో చాలు భర్త పై ప్రేమ చాటడానికి..!! 

Ram charan-Upasana :  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్.. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్ల పరంగా వసూలు రికార్డు చేసి సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను జపాన్లో కూడా త్వరలోనే విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇక అందుకే అక్కడ ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్, తారక్ తో పాటు రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ప్రమోషన్స్ లో పాల్గొనడం జరిగింది. ఇక ఈ ప్రమోషన్స్ కోసం జపాన్ కి వెళ్లి జపాన్ వీధుల్లో తన భర్తతో సమయాన్ని బాగా ఎంజాయ్ చేసింది ఉపాసన. ఇక ప్రమోషన్స్ లో కూడా తన భర్త కు సపోర్ట్ ఇస్తూ.. తన వెన్నంటే ఉంటోంది ఉపాసన. ఇక అక్కడ జపాన్లోని టోక్యో వీధుల్లో తన భర్తతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసుకొని.. తన భర్త పై ఉన్న ప్రేమను మరొకసారి చాటింది. ఈ ఒక్క ఫోటో చాలు ఉపాసన తన భర్త పై ఉన్న ప్రేమ చాటడానికి..

Advertisement
Upasana enjoy lots of fun with Ram Charan in Japan streets ..this one photo is enough to show love for husband
Upasana enjoy lots of fun with Ram Charan in Japan streets ..this one photo is enough to show love for husband

అంతేకాదు ఈ జంట ఎంతో మందికి ఆదర్శ జంట అని చెప్పవచ్చు. ప్రేమించి మరీ వివాహం చేసుకున్న వీరు..వివాహం జరిగి దాదాపు 10 సంవత్సరాల పైనే అవుతున్నా.. ఎంతో అన్యోన్యంగా ఒకరి మీద ఒకరు గౌరవంగా తమ కెరియర్ ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఉపాసన ఒకవైపు కోడలిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. మరొకవైపు భార్య గా కూడా భర్తకు తోడుగా నిలుస్తోంది. అంతేకాదు తన కెరీర్ లో కూడా ఆమె దూసుకుపోతుందని చెప్పాలి. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి వారసురాలుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అపోలో హాస్పిటల్ లో వైస్ ఛైర్మన్ గా పనిచేస్తోంది. అంతేకాదు వైద్యరంగంలో ఆమె అందించిన ఎన్నో సేవలకు గానూ.. ఆమె ప్రతిభను గుర్తించిన పలు సంస్థలు ఆమెకు అత్యుత్తమ పురస్కారాలను కూడా అందజేశారు.

Advertisement

ఇక కరోనా సమయంలో కూడా సోషల్ మీడియా ద్వారా ఎంతో మందికి అండగా నిలిచిన ఉపాసన.. మెగా కోడలుగా మరొకసారి తనను తాను ప్రూవ్ చేసుకుంది. అంతేకాదు మెగా కోడలుగా ఉపాసన వారి ఇంటికి రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని నాగబాబు కూడా ఒక మీడియా ముందు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఉపాసన తన భర్తతో కలిసి దిగిన ఫోటో చూసి ప్రతి ఒక్కరు..” ఆదర్శ దంపతులు.. అన్నా, వదినలు సూపర్ ” అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement