Unstoppable – pawan kalyan : ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా సెలబ్రిటీ టాక్ షో గా గుర్తింపు తెచ్చుకున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ వి కే కార్యక్రమం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . బాలయ్య బాబు హోస్టుగా చేస్తున్న ఈ కార్యక్రమం ఇప్పటికే మొదటి సీజన్ ని కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు రెండవ సీజన్లో భాగంగా స్టార్ హీరోలు ,రాజకీయ నాయకులు హాజరవ్వడమే కాకుండా ఎన్నో తెలియని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అంతేకాదు మీడియా ముందు రావడానికి కూడా ఇష్టపడిన స్టార్ హీరోలను ఈ సెలబ్రిటీ టాక్ షో కి తీసుకొస్తూ ఉండడం గమనార్హం.
ఈ క్రమంలోని ఈ షో కి ప్రభాస్, గోపీచంద్ తాజాగా హాజరయ్యారు . త్వరలోనే ఈ ఎపిసోడ్ కూడా ప్రసారం కానుంది. తర్వాత వచ్చే ఎపిసోడ్ కి ఎవరు రాబోతున్నారు అనే చర్చ అప్పుడే మొదలయ్యింది. ఈ క్రమంలోని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి పవన్ కళ్యాణ్ ఈ షో కి గెస్ట్ గా రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రతి విషయంలో కూడా త్రివిక్రమ్ కీలకపాత్ర పోషిస్తారని విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకునే త్రివిక్రమ్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి అన్ స్టాపబుల్ షో కి రాబోతున్నారు.