jabardasth Rajesh జబర్దస్త్ బుల్లితెరపై ప్రసారమవుతున్న నెంబర్ వన్ కామెడీ షో.. మొదట్లో చిన్నపిల్లలతో స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించిన రాకింగ్ రాకేష్.. ఆ తర్వాత కాలంలో పిల్లలు పెద్ద వాళ్ళు అవడంతో పెద్దవారినే తన స్కిట్స్ లో పెట్టుకొని సక్సెస్ అవుతున్నారు. ఇదిలా ఉండగా జోర్దార్ సుజాతతో ఈయన ప్రేమలో పడి ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతోంది.
ప్రస్తుతం రాకేష్ స్కిట్లలో సుజాత చేరడం వల్ల ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని.. మొదట్లో తామిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ బుఖాయించినప్పటికీ ఆ తర్వాత కాలంలో ఇద్దరి నడుమ ఉన్న ప్రేమను బయటపెట్టారు.వారిద్దరూ హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడంతో వారిద్దరూ చెప్పకపోయినా సరే వీరి మధ్య ప్రేమ ఉందని అంతా కన్ఫామ్ చేసేసారు… ఇదిలా ఉండగా జబర్దస్త్ రాజేష్ జీవితం లో సుజాత కంటే ముందు ఉన్న అమ్మాయి ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇందులో ఒక బిగ్ ట్విస్ట్ కూడా వుంది. జబర్దస్త్ వచ్చిన మొదట్లో రాకేష్ ఒక బుల్లితెర నటిని ప్రేమించాడట. ఆమెకు కూడా రాకేష్ అంటే చాలా ఇష్టమట. కాకపోతే ఇద్దరి కులాలు వేరు కావడం వల్ల వీరి పెళ్లికి ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని సమాచారం. దాంతో అప్పటినుంచి విడివిడిగా ఉంటున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత రాకేష్ కు సుజాత పరిచయం కావడం అది కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకొని ప్రస్తుతం పెళ్లికి సిద్ధమవుతున్నారు.