Samantha – Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మాయాసైటిస్ అనే అరుదైన వారితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుట పడింది.. తన వరుస సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. సమంత ని నాగ చైతన్య ని తలచుకుని బాధపడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది పాత వీడియో అయినప్పటికీ కూడా ప్రస్తుతం కొంతమంది పని కట్టుకొని మరి ఆ వీడియోని వైరల్ చేసే పనిలో పడ్డారు..
సమంత యశోద సినిమా ప్రమోషన్లలో భాగంగా సుమకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు.. నీకు మయోసైటిస్ అని నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అప్పుడు వచ్చిన వార్తలకు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు అని సుమా అడిగారు. అందుకు సమాధానం గా సమంత.. కొన్ని రోజులు మంచివి కొన్ని రోజులు చెడ్డవి.. కానీ ఒక్కో రోజు నేను ముందుకు కూడా అడుగు వేయలేని పరిస్థితి ఉంది కొన్ని రోజులు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం వచ్చేసానా అని అనిపిస్తుంది అంటూ.. సమంత ఎమోషనల్ అయింది.. తనలో దాగివున్న బాధను దీగమింగుకొని కన్నీళ్లు పెట్టుకుంది.
చాలా సంతోషంగా ఉంది సమంత గారు మీరు మా అందరికీ ఇన్స్పిరేషన్ అని సుమ చెబుతుంది. మీరు ఈ సమస్యతో బాధపడుతున్నారు అని ఇప్పుడు బయటకు చెప్పగలిగారు. కానీ చెప్పలేని పరిస్థితుల్లో మీరు కొన్ని రోజుల క్రితం ఉన్నారు. అవును అప్పుడు నేను నా బాధను బయటకు చెప్పలేకపోయాను. కానీ నేను గెలిచి బయటకు వచ్చాను అని సమంత అన్నారు.
నేను మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి.. నేను ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిస్థితి ఇంత క్రిటికల్ అయితే కాదు నేను ఇంకా చావలేదు. బ్రతికే ఉన్నాను అని సమంత చెబుతుంది. ప్రస్తుతానికి అయితే నేను చాలా లేదు కానీ ఇది డిఫికల్ట్ అని నేను ఇప్పటికీ పోరాటం చేస్తున్నాను అనే మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. సమంత ఈ మాటలన్నీ కూడా నాగచైతన్యను ఉద్దేశించే మాట్లాడిందని అప్పట్లో అంతా అనుకున్నారు. బాగా చైతన్య వలన సమంత ఎంత బాధ పడిందో కళ్ళకు కట్టినట్లుగా ఈ వీడియోలో సమంత బాగా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు అదే వీడియోను మరోసారి వైరల్ చేస్తున్నారు కొంతమంది.