Top 10 Movies : అత్యధిక సెంటర్స్ లో 175 రోజులు ఆడిన టాప్ 10 తెలుగు మూవీస్!

Top 10 Movies : ఈ రోజుల్లో ఒక సినిమా మూడు రోజులు ఆడడమే గగనంగా మారిపోయింది. అలాంటిది 175 రోజులు ఎక్కడ ఆడుతుంది.. ఒకప్పుడు సినిమాలు 50 రోజులు, 100 రోజులు, 175 రోజులు, 200 రోజులకు పైగా ఆడేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడంటే ఇన్ని వందల కోట్లు వచ్చాయని చెప్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం సినిమా రికార్డులను అవి ఆడిన థియేటర్లను బట్టి లెక్క వేసేవాళ్ళు. మా సినిమా ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకోవాలంటే ఎన్ని థియేటర్లలో వంద రోజులు ఆడింది.. ఎన్ని థియేటర్లలో 175 రోజులు ఆడింది అంటూ లెక్కలు తీసేవాళ్ళు అభిమానులు. అలా తెలుగు ఇండస్ట్రీలో 175 రోజులు అత్యధిక థియేటర్స్ లో ఆడిన టాప్ 10 సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Advertisement

1. సింహాద్రి : 52 సెంటర్లు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 2003లో విడుదలైంది. ఇండస్ట్రీకి ఎలాంటి హిట్స్ లేని సమయంలో విడుదలైన సింహాద్రి సంచలన విజయం సాధించడమే కాకుండా 175 సెంటర్లలో 100 రోజులు.. 52 సెంటర్లలో 175 రోజులు పూర్తి చేసుకొని ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Advertisement

2. పోకిరి : 48 సెంటర్లు మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ 200 సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకుని.. 48 సెంటర్లలో 175 రోజులు రన్ పూర్తి చేసుకుంది.

Top 10 Telugu Movies which played for 175 days in most centers
Top 10 Telugu Movies which played for 175 days in most centers

3. ఇంద్ర : 31 సెంటర్లు మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి గోపాల్ తారక ఎక్కించిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా ఇంద్ర. 2002లో విడుదలైన ఈ సినిమా 122 సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా 31 కేంద్రాల్లో 175 రోజులు పూర్తి చేసుకుంది.

4. సమరసింహారెడ్డి : 29 సెంటర్లు 1999లో బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సమరసింహారెడ్డి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా 29 థియేటర్లలో 175 రోజులు ఆడింది.

5. పెళ్లి సందడి : 27 సెంటర్లు ఎలాంటి అంచనాలు లేకుండా శ్రీకాంత్ హీరోగా 1996లో విడుదలైన సినిమా పెళ్లి సందడి. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా 27 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.

6. నువ్వే కావాలి: 25 సెంటర్లు తరుణ్, రిచాను పరిచయం చేస్తూ స్రవంతి మూవీస్, ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్స్‌లో వచ్చిన లవ్ స్టోరీ నువ్వే కావాలి. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయింది. 20 కోట్ల షేర్ వసూలు చేయడమే కాకుండా.. 25 సెంటర్లలో 175 రోజులు ఆడింది.

7. ప్రేమాభిషేకం : 19 సెంటర్లు అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన ఆల్ టైమ్ లవ్ క్లాసిక్ ప్రేమాభిషేకం. దాసరి తెరకెక్కించిన ఈ చిత్రం 1981లో విడుదలైంది. అప్పట్లోనే ఈ చిత్రం 19 కేంద్రాల్లో రజతోత్సవం చేసుకుంది.

8. నరసింహనాయుడు: 17 సెంటర్లు సమరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ నరసింహనాయుడు. 2001లో విడుదలైన ఈ చిత్రం 17 సెంటర్లలో 175 రోజులు ఆడేసింది.

9. కలిసుందాం రా: 14 సెంటర్లు విక్టరీ వెంకటేష్ హీరోగా ఉదయ్ శంకర్ తెరకెక్కించిన సినిమా కలిసుందాం రా..! 2000 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అంతేకాదు.. 14 సెంటర్లలో 175 రోజులు ఆడింది.

10. లవకుశ: 13 సెంటర్లు 1963లోనే ఎన్టీఆర్ రికార్డులకు తెరతీసారు. తెలుగు ఇండస్ట్రీలో తొలి కలర్ సినిమాగా వచ్చిన లవకుశ.. అప్పట్లోనే కోటి రూపాయల షేర్ వసూలు చేసింది. అలాగే 13 సెంటర్లలో 175 రోజులు ఆడింది

Advertisement