Chiranjeevi – Balakrishna : సినీ పరిశ్రమలోని కొందరు ప్రముఖులు సెంటిమెంట్స్ ని చాలా గట్టిగా నమ్ముతారు. వారే కాదు వారు అభిమానులు కూడా సెంటిమెంట్స్నిఆ లెక్కలేస్తూ సినిమా హిట్టా, ఫట్టా అనేది కూడా చెప్పుకొస్తుంటారు. అయితే ఇప్పుడు సంక్రాంతికి విడుదల కాబోతున్న వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల విషయంలో ఓ సెంటిమెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వివరాలలోకి వెళితే సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి రెండు సినిమాలు ఒక్క రోజు తేడాలో థియేటర్లలోకి దిగుతున్నాయి.
అయితే బాలయ్య, చిరు మధ్య ఎప్పుడు పోటీ జరిగినా మంచి మజా ఉంటుంది. గతంలో రెండు సార్లు హోరాహోరీగా జరిగిన పోరులో 1999 సంక్రాంతికి వచ్చిన సమరసింహారెడ్డి సినిమా స్నేహంకోసం సినిమాపై మంచి విజయం సాధించింది. ఇక ఆ తర్వాత 2001 సంక్రాంతికి చిరు మృగరాజు, బాలయ్య నరసింహానాయుడు సినిమాతో పాటు వెంకటేష్ దేవీపుత్రుడు సినిమా కూడా రాగా, ఇందులో నరసింహానాయుడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరంజీవి నటించిన మృగరాజు చిరు కెరీర్లోనే పెద్ద డిజాస్టర్ అయింది. ఇక దేవీపుత్రుడు యావరేజ్ సినిమాగా నిలిచింది.
అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే చిరు, బాలయ్య ఇద్దరు నటించిన సినిమాల్లోనూ హీరోయిన్ సిమ్రానే. మృగరాజులో సిమ్రాన్ మెయిన్ హీరోయిన్… సైడ్ హీరోయిన్ సంఘవి కాగా, నరసింహానాయుడులో సిమ్రాన్ మెయిన్ హీరోయిన్ కాగా ప్రీతిజింగానియా, ఆశాషైనీ కూడాఉన్నారు. ఇప్పుడు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలోను శృతి హీరోయిన్. అప్పుడు ఒకే హీరోయిన్‌తో బరిలోకి దిగిన బాలయ్య, చిరులలో బాలయ్య మంచి హిట్ కొట్టాడు. మరి నాడు ఉన్న సెంటిమెంట్ 2023 సంక్రాంతికి కూడా రిపీట్ అయితే చిరు వాల్తేరు వీరయ్యపై బాలయ్య వీరసింహారెడ్డి పైచేయి సాధించినట్టేనని కొందరు అభిమానులు లెక్కలేస్తున్నారు.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.