Heroines Marriages : ఈ హీరోయిన్స్ అంద‌రు సీక్రెట్‌గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారెందుకు.. అందులోనే మ‌జా ఉంటుందా?

Heroines Marriages : సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్లు కెరీర్ లో స్థిరపడేందుకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలాగే తమ పర్సనల్ లైఫ్ ని అంతే రహస్యంగా ఉంచుతారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. లేటెస్ట్ గా హీరోయిన్ పూర్ణకు పెళ్లైపోయిందని సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కొన్నాళ్ల క్రితం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోను షేర్ చేస్తూ.. తనకు కాబోయే భర్త ఇతనే అంటూ పరిచయం చేసింది. షానిద్ అసిఫ్ అలీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపింది. అప్పట్లో ఎంగేజ్ మెంట్ ఫోటోల్ని కూడా షేర్ చేసింది.

లేటెస్ట్ పూర్ణ తన సోషల్ మీడియాలో తనకు ఎప్పుడో పెళ్లి అయిపోయిందని, దుబాయ్ లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నట్లు ప్రకటించింది. కాగా త్వరలో కేరళలో రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. హీరోయిన్లందరూ సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుంటున్నారు. అందులోనే వాళ్లకు ఇంట్రెస్ట్ ఉంటుందా అనేలా కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి చాలామంది హీరోయిన్లు తమ ప్రొఫెషనల్ లైఫ్ ని తమ అభిమానులతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తూంటారు. కానీ తమ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా చెప్పరు. ఈ క్రమంలో పెళ్లిళ్లు అయిపోయిన చాలా రోజులకు తమ రిలేషన్ గురించి చెబుతున్నారు.

tollywood hroines secret marriages
tollywood hroines secret marriages

Heroines Marriages : వాళ్లు కూడా సీక్రెట్ మ్యారేజ్

గతంలో ప్రియమణి, ప్రణీత మరికొంతమంది కూడా తమ పెళ్లి గురించి వెంటనే చెప్పలేదు. ఎప్పటికో గానీ తమ అభిమానులకు ఫోటోలు షేర్ చేసి రివీల్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా హీరోయిన్ నయనతార కూడా అందరికీ తెలిసేలా జూన్ లో వివాహం చేసుకున్నారు. కానీ నయనతార, విఘ్నేష్ లకు వివాహం జరిగి ఏకంగా ఆరేళ్లు అయ్యిందంటూ డాక్యూమెంట్స్ తో సహా ప్రూవ్ చేశారు. మరి ఇలా ఎక్కువగా తమ పెళ్లిళ్లు గురించి సీక్రెట్ గా ఉంటున్నారు. ఇలా చేయడంలో హీరోయిన్లకు మంచి మజా ఉంటుందేమోనని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.