God Father Movie : గాడ్ ఫాదర్ లో ఈ ఒక్క సీన్ చాలు .. మీ టికెట్ డబ్బులు మొత్తం వెనక్కి వచ్చేసినట్టే ఫీల్ అవుతారు !

God Father Movie : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ భారీ అంచనాల మధ్య నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రీమియంతోనే గాడ్ ఫాదర్ మూవీకి ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యింది. నిన్న మొన్నటి వరకు ఈ మూవీ ఎలా ఉంటుందో అనే సందేహాలన్నీ క్లియర్ అయిపోయాయి. ఈ మూవీ లూసిఫర్ రీమేక్ కంటే మించి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు అద్భుతమైన పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. గాడ్ ఫాదర్ మూవీలో ప్రతి సీన్ ను ఎంతో చక్కగా తెరకెక్కించారు.

ఈ మూవీ కేవలం గాడ్ ఫాదర్ అభిమానులకే కాకుండా ప్రేక్షకులకు కూడా అద్భుతంగా తెరకెక్కింది. గాడ్ ఫాదర్ లో చిరంజీవి బ్రహ్మ పాత్రలో ఎంతో వైవిధ్యంగా నటించారు. ఈ సీన్స్ చూసిన ప్రతి ఒక్కరికీ టికెట్ డబ్బులు మొత్తం వెనక్కి వచ్చేసినట్లే అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు. మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో వచ్చిన బెస్ట్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. నయనతార, సత్య దేవ్ కీలక పాత్రలో నటించారు. వీళిద్దరి ఎలివేషన్స్ కూడా సినిమాకు కీలకంగా నిలిచింది.

This one scene in God Father Movie is enough
This one scene in God Father Movie is enough

God Father Movie : గాడ్ ఫాదర్.. బ్లాక్ బస్టర్ సీన్

ముఖ్యంగా సల్మాన్ ఖాన్, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సీన్ అయితే ఓ రేంజ్ లో నిలిచింది. ఖచ్చితంగా ఈ సినిమా చూసినవారంతా చాలా రోజుల తర్వాత ఓ మంచి యాక్షన్ పొలిటికల్ డ్రామాను చూసిన ఫీలింగ్ లో ఉంటారు. అలాగే ఆచార్య మూవీ తర్వాత చిరంజీవికి ఇలాంటి ఓ హిట్ పడితే వచ్చే కిక్కే వేరు. నయనతార, చిరంజీవి మధ్య వచ్చే సీన్స్, డైలాగ్స్ కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక బాస్ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ సోషల్ మీడియాలో గాడ్ ఫాదర్ మ్యానియా నడుస్తుంది. ఓ కంప్లీట్ ఫీలింగ్ తో థియేటర్ నుండి బయటకు రావడం పక్కా అంటున్నారు మెగా ఫ్యాన్స్.