Tamannah : అందుకే తమన్నా పట్టించుకోవడం లేదా.. హర్ట్ అవుతున్న ఫ్యాన్స్..!

Tamannah : మిల్క్ బ్యూటీ తమన్నా తాజాగా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం.. అయితే ఎట్టకేలకు నిన్న విడుదలైన ఈ సినిమాను తమన్నా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. అయితే ఇందుకు గల కారణం ఏమిటి అని అందరూ చర్చించుకుంటున్నారు. రిలీజ్ కి వారం ముందు వరకు ఆమె ఈ సినిమాతో తనకు ఎలాంటి సంబంధం లేనట్లే వ్యవహరించింది. నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్న ఈమె ఈ సినిమాకి మాత్రం చెప్పలేదట. దీంతో ఏం జరిగి ఉంటుంది అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సినిమా రిలీజ్ కి ముందు టీం ఎలాగోలా తమన్నాను ఒప్పించి ప్రమోషన్స్ కు తీసుకొచ్చారు. అయితే ప్రీరిలీజ్ ఈవెంట్ తో పాటు ప్రెస్ మీట్ కి కూడా హాజరయ్యింది. శుక్రవారం రోజు వచ్చిన ఈ సినిమా ఆవరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.

Advertisement
This is the reason to Tamannaah doesn't care..!
This is the reason to Tamannaah doesn’t care..!

ఇందులో తమన్నా కీలక పాత్ర దక్కించుకుంది..అయితే అలాంటప్పుడు సినిమాకెందుకు దూరంగా ఉందని చూస్తే.. తన పాత్రను తీర్చిదిద్దన విధానమే కారణమని తెలుస్తోంది ..ఈ సినిమాలో తమన్నా పాత్రకు ట్రాజింగ్ ఎండ్ ఇచ్చారు . ఆమెని క్యాన్సర్ పేషెంట్గా చూపించారు. ట్రీట్మెంట్ లో భాగంగా జుట్టు ఊడిపోవడం.. గుండు చేయించుకోవడం లాంటి సన్నివేశాలు చూపించడంతో గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె అలాంటి పాత్రలో నటించేసరికి అభిమానులు హర్ట్ అయ్యారు. అంతేకాదు ఈ లుక్స్ తమన్నాకు సూట్ కాలేదు కానీ పాత్రను చూపించిన తీరు నచ్చక.. ఈ సినిమా తన కెరియర్ పై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందేమోనని ఆమె సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉందని సమాచారం. అందుకే ఈమె పట్టించుకోవడంలేదని సమాచారం.

Advertisement
Advertisement