NTR : సినిమాలతో పాటు ఫ్యామిలీకి కూడా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు . ఈయనకు సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి సరదా ట్రిప్ వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మొన్నటి వరకు వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు మళ్లీ ఫారిన్ ట్రిప్ వేస్తున్నారు అమెరికాకు కుటుంబంతో కలిసి ఒక నెల రోజులపాటు అక్కడే ఉండడానికి ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్. తాజాగా తన భార్య పిల్లలతో కలిసి ఎయిర్పోర్టులో మీడియా కంట పడ్డారు.

కొత్త ఏడాదికి అమెరికా నుండి వెల్కం చెప్పి.. సంక్రాంతి పండుగ లోపు ఇండియాకి రావాలని ప్లాన్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ప్రస్తుతం ఆయన సినిమాలేవి లేని కారణంగా సమయం ఖాళీగా ఉండడంతో ఇలా వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నట్లు సమాచారం. అమెరికా ట్రిప్పు నుంచి వచ్చిన తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎంతవరకు పట్టాలెక్కుతుందో చూడాలి. ఇప్పటికే దాదాపు 9 నెలలు కావస్తున్నా ఇంకా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు కూడా మరొకవైపు డైరెక్టర్ పై కోపంగా ఉన్నారు. మరి ఇప్పుడైనా ఆయన కథను సిద్ధం చేస్తారో లేదో చూడండి.