Pushpa 2 : పుష్ప 2 లో రామ్ చరణ్ పాత్ర ఇదే.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

Pushpa 2 : ప్రస్తుతం రామ్ చరణ్ .. శంకర్ పాన్ ఇండియా సినిమా షూటింగ్లో బిజీగా పాల్గొంటున్న విషయం తెలిసిందే.. కానీ ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన పుష్ప 2 సినిమాలో కూడా భాగం కానున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 మూవీ క్లైమాక్స్ లో రామ్ చరణ్ కనిపిస్తారు అని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా నటించిన ఎవడు సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్ రోల్ పోషించిన విషయం తెలిసిందే . ఇప్పుడు పుష్ప 2 క్లైమాక్స్లో బన్నీకి సమస్య రాగా ఆ సమస్యను పరిష్కరించడానికి రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తాడు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

This is the Ramchandra role in pushpa 2..fans get be happy..!
This is the Ramchandra role in pushpa 2..fans get be happy..!

ఇప్పటికే సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా భారీ విజయాన్ని అందుకోగా.. ఈ కాంబినేషన్లో మరో మూవీ కూడా ఉంటుందని వార్తలు అప్పుడు బాగా వినిపించాయి. అందుకే పుష్ప 2 సినిమాకి .. రామ్ చరణ్ తో సుకుమార్ తీసే తర్వాత సినిమాకి లింకు ఉండేలా సుకుమార్ ప్లాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి . మరి ఈ విషయంలో సుకుమార్ లోకేష్ కనగరాజును ఫాలో అవుతున్నారని కూడా సమాచారం. ఏది ఏమైనా అల్లు అర్జున్ , రామ్ చరణ్ ఇద్దరూ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే మెగా అభిమానుల సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.