Movies :చూస్తుండగానే ఫిబ్రవరి కూడా వచ్చేసింది.. కొత్త క్యాలెండర్లో రెండో నెలలో మొదటి వారం 6 సినిమాలు విడుదల కానున్నాయి.. ఒక్కసారి వాటిపై మీరు లుక్కేయండి..
మైఖేల్
సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జయ కోడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మైఖేల్.. పాన్ ఇండియా చిత్రం గా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌కుమార్, గౌతమ్ మేనన్, దివ్యాంశ కౌశిక్, అనసూయ, వరుణ్ సందేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
సువర్ణ సుందరి..
సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సువర్ణ సుందరి.. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. పూర్ణ నటించిన సువర్ణ సుందరి రియన్ కర్నేషన్ సబ్జెక్టు రోలర్ కోస్టర్ స్క్రీన్ ప్లే తో మినిట్ బై మినిట్ ఆడియన్స్ కి మంచి థ్రిల్లర్ ని ఇస్తుంది. థ్రిల్లర్ సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. అలాంటి జోనర్ లో వస్తున్న సువర్ణ సుందరి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రేక్షకులు ముందుకు రానుంది.
రైటర్ పద్మభూషణ్
డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో రూపొందిన సినిమా రైటర్ పద్మభూషణ్. ఇందులో సుహాస్, టిన శిల్ప రాజ్, ఆశిష్ విద్యార్థి, గౌరీ ప్రియ తదితరులు నటించరూ. ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 3న విడుదల కానుంది.
ప్రేమదేశం:
త్రిగున్ , అజయ్ కథుర్‌వార్, మేఘా ఆకాశ్, మాయ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా ప్రేమదేశం. శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మధుబాల కీలక పాత్రలో నటిస్తుంది. నటిస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 3న దేయేటర్స్ లో విడుదలైంది.
బుట్టబొమ్మ:
కోలీవుడ్ బ్యూటీ అనిఖా సురేంద్రన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా బుట్టబొమ్మ. సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శౌరి చంద్రశేఖర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అరకు బ్యాక్ డ్రాప్‌లో సాగే ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న బుట్టబొమ్మ ఫిబ్రవరి 4న విడుదల కానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన కప్పెల కి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఈ సినిమాతో అనిఖ టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతుంది.