Mahesh Babu : అరవింద సమేత , అలా వైకుంఠపురం అనే బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ తో మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై కంటిన్యూగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. నిర్మాతలు ఖండిస్తూనే ఉన్నారు. అయితే త్రివిక్రమ్ తీస్తున్న కంటెంట్ వేరే.. మహేష్ రెగ్యులర్ గా కంప్లీట్ చేస్తూన్న కంటెంట్ వేరే ఉండటం ఇప్పుడు హార్ట్ టాపిక్ గా మారింది.
ఒకసారి అతడు సినిమా తీశారు. మరోసారి ఖలేజా సినిమాని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకో సినిమాని తెరకెక్కిస్తున్నారు.. ఒకటి కాదు రెండు కాదు మొత్తం మూడు సార్లు ఒకే దర్శకుడు తో కలిసి పని చేయటం దర్శకుడికి మధ్య అనుబంధం ఉండి ఉండాలి. కానీ ఇండస్ట్రీలో ఇందుకు భిన్నమైన స్టోరీ వినిపిస్తోంది. అసలు త్రివిక్రమ్ మహేష్ కు పడటం లేదని వారు చెప్పుకొస్తున్నారు. అసలు మహేష్ తో త్రివిక్రమ్ కొత్త సినిమా ప్రారంభించినప్పటి నుంచి రూమర్స్ రావడం మొదలయ్యాయి.
మొదట త్రివిక్రమ్ తెరకెక్కించిన ఫస్ట్ షెడ్యూల్ నచ్చలేదని కథ మొత్తం మార్చాల్సిందే అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు పట్టుపట్టాడని ప్రచారాలు జోరుగా సాగాయి. ఆ తరువాత తమన్ నుంచి ట్యూన్స్ విషయంలో త్రివిక్రమ్ పై మహేష్ కోపంగా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు 30% షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా త్రివిక్రమ్ మహేష్ గుర్రు గానే ఉన్నాడు. అందుకే ప్రిన్స్ షూటింగ్ కు దూరంగా వరుస హాలిడేస్ ట్రిప్స్ చేసుకుంటూ ఉన్నాడట.దాంతో నిర్మాతలు వెళ్లి మహేష్ తో మాట్లాడారట. ఈ లేటెస్ట్ రూమర్స్ పై నిర్మాత నాగ వంశీ స్పందిస్తూ రూమర్స్ లని నమ్మవద్దని సినిమా అద్భుతంగా వస్తుందని ఆయన తెలిపారు. ఇక వరుస పెట్టి వస్తున్న రూమర్స్ పై కాస్త టెన్షన్ గానే ఉన్నారు