Vishnu Priya: ఆ డైరెక్టర్ అవకాశం పేరుతో కోరిక తీర్చమన్నాడు .. విష్ణుప్రియ..!

Vishnu Priya: విష్ణు ప్రియ.. యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తన అల్లరితో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ ఉంటుంది. ఇకపోతే గత కొద్ది రోజుల నుంచి ఈమెకు ఎక్కువగా సినీ ఫీల్డ్ లో అవకాశాలు రావడంతో అక్కడే అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది విష్ణు ప్రియ.. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.. క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన విష్ణు ప్రియ క్యాస్టింగ్ కౌచ్ బాధితుల్లో తాను కూడా ఉన్నానంటూ తెలిపింది.

కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ట్రాప్ లో తాను పడలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియ మాట్లాడుతూ.. నన్ను కూడా సినిమా అవకాశాల పేరుతో ఒక డైరెక్టర్ వాడుకోవాలని చూశారు.. ముఖ్యంగా నేను కెరియర్ ఆరంభం లో సినిమా అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో ఒక స్టార్ డైరెక్టర్ అవకాశం ఇస్తామంటూ నన్ను నమ్మించాడు . ఇక సినిమాలో ఛాన్స్ అయితే ఇస్తాం కానీ దానికి బదులుగా నువ్వేం చేస్తావు అని అడుగుతూనే.. తన కోరిక తీర్చమని డైరెక్ట్ గా అడిగాడు.. కానీ నాకు అలాంటి చెత్త పనులు చేయాల్సిన కర్మ పట్టలేదు.. అలా వచ్చే అవకాశాలు నాకు వద్దు అంటూ ఆ డైరెక్టర్ ముఖాన్నే చెప్పేశాను అంటూ తెలిపింది విష్ణు ప్రియ.

The director granted the wish in the name of chance  Vishnupriya
The director granted the wish in the name of chance  Vishnupriya

ఇకపోతే సినీ ఇండస్ట్రీలో కేవలం విష్ణు ప్రియ మాత్రమే కాదు ఈమె లాగా మరెంతోమంది అమ్మాయిలు అవకాశాల పేరిట మోసపోతున్నారు. ఇక విష్ణు ప్రియ ఇలా కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని మరొకసారి తెలియజేసింది. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఈమె నటించిన వాంటెడ్ పండుగాడు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా ద్వారా ఈమె ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధం కాబోతున్న నేపథ్యంలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని అభిమానుల సైతం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.