Taraka Ratna : తారకరత్న గుండెపోటుతో ఇక్కడే కుప్ప కూలిపోయాడు..!

Taraka Ratna : లోకేష్ పాదయాత్ర జనవరి 27 న మొదలవగా.. అదే రోజున ఉదయం నుంచి తారకరత్న అస్వస్థతకు గురయ్యారని సమాచారం. గత 23 రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్న తారకరత్న కోలుకొని సాధారణ మనిషి అవుతారని ప్రజలు అందరూ భావించారు.. కానీ ఎవరూ ఊహించని విధంగా తారకరత్న మృతి చెందారు. అయితే తారకరత్న చేసిన ఒకే ఒక్క పొరపాటు.. ఆయన ప్రాణం తీసిందని కామెంట్లు వ్యక్తమౌతున్నాయి. ఆ పాదయాత్ర చేయడం ద్వారానే ఆయన ఆసుపత్రి పాలయ్యారని సమాచారం.

తారకరత్న పాదయాత్రలో పాల్గొని ఎండలో తిరగడం వలన ఆయన సొమ్మసిల్లి పోయారని సమాచారం. అయితే అదే సమయంలో ఆయనకు గుండెపోటు రావడం జరిగింది. అదే సమయంలో రక్త ప్రసరణ ఆగిపోవడం వలన మెదడులో రక్తం గడ్డ కట్టింది. వైద్యులు ఎంత కష్టపడినా కూడా తారక రత్న ఈ సమస్య నుంచి పూర్తిస్థాయిలో కోలుకోలేదు. దాంతో ఆయన మరణించారు. ఇక తారకరత్న మరణం నందమూరి అభిమానులను తీవ్రస్థాయిలో బాధపెడుతోంది.

నారాయణ హృదయాలయలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తారకరత్న మృతి చెందడం గమనార్హం. బ్రెయిన్ డ్యామేజ్ కావడం వలన కోమాలోకి వెళ్లిన తారకరత్న కోలుకోవడానికి వైద్యులు చాలా ప్రయత్నాలుచేశారు. అయినప్పటికీ ఆరోగ్యం వివిధ అనారోగ్య సమస్యల వలన, షుగర్ లెవెల్స్ పెరగడం వలన ఆయనకు గుండె పోటు వచ్చిందని సమాచారం. వేరువేరు ఆరోగ్య సమస్యలు తారకరత్న ఆరోగ్యంపై ప్రభావం చూపాయని తెలుస్తోంది.మరో నాలుగు రోజుల్లో తారకరత్న పుట్టినరోజు కాగా అదే సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఆయన ఫాన్స్ ను మరింత దుఃఖానికి గురి అవుతున్నారు.

Tarakaratna collapsed due to heart attack here..!
Tarakaratna collapsed due to heart attack here..!

ఒకవేళ తారకరత్న పాదయాత్రకు హాజరుకాకుండా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని వారి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తారకరత్న మృతికి సంతాపం తెలియజేశారు. నటుడు తారకరత్న భౌతికంగా మరణించినా కూడా సినిమాల ద్వారా అభిమానుల హృదయాలలో ఆయన జీవించి ఉన్నారని చెప్పవచ్చు.