Taraka Ratna : చెరిగిపోని అరుదైన తారకరత్న రికార్డ్..

Taraka Ratna :నందమూరి తారక రామారావు నట వారసుడిగా టాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చిన వారిలో నందమూరి తారకరత్న ఒకరు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు.. ఈ సినిమా 2002లో విడుదలై బ్లాక్ బస్టర్‌ హిట్ గా నిలిచింది. సక్సెస్‌ఫుల్ ఆడియో ఆల్బమ్స్‌తో యువతకు చేరువైంది. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా చేస్తున్న సమయంలోనే ఏకంగా 9 సినిమాలు అనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు నందమూరి తారకరత్న. టాలీవుడ్ కి తారకరత్న ఎంట్రీ ఇస్తూనే ఒకేసారి 9 సినిమాలకు సంతకం చేసి అరుదైన రికార్డును క్రియేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రికార్డును ఇంతవరకు మరి హీరో ఇప్పటివరకు బ్రేక్ చేయలేదు.. అంతటి అరుదైన రికార్డును నందమూరి తారకరత్న సొంతం. బహుశా ముందు ముందు ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరని కూడా చెప్పొచ్చు..

కానీ తారక రత్న కి మాత్రం అదృష్టం కలిసి రాలేదు. 15 కు పైగా సినిమాలు చేసినప్పటికీ తారకరత్నకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. నందమూరి తారక రామారావు కొడుకైన నందమూరి మోహన కృష్ణ తనయుడు తారకరత్న. హీరోగా అదృష్టం కలిసి రాకపోవడంతో విలన్ కూడా చేసి మెప్పించారు.

కుటుంబం విషయానికి వస్తే 2012లో నందమూరి తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు అలేఖ్య రెడ్డి. తారకరత్న హీరోగా వచ్చిన నందీశ్వరుడు సినిమాకు అలేఖ్య క్యాస్టూమ్ డిజైనర్‌గా కూడా పని చేశారు. నందమూరి తారకరత్న చేసింది కొద్ది సినిమాలే అయినా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు. ఆయన గుండెపోటుతో మరణించడంతో యావత్ సినీలోకం దిగ్భ్రాంతికి
గురి చేసింది. టాలీవుడ్ ఒక్కసారిగా మూగబోయింది.

Nandamuri taraka Ratna health condition critical on yuvagalam participation
Nandamuri taraka Ratna health condition critical on yuvagalam participation

ఆయన నటించిన సినిమాలు ఓ సారి చూద్దాం..

ఒకటో నంబర్ కుర్రాడు(2002)
యువ రత్న(2002)
తారక్(2003)
నో(2004)
భద్రాద్రి రాముడు(2004)
పకడై(2006)
అమరావతి(2009)
వెంకటాద్రి(2009)
ముక్కంటి(2010)
నందీశ్వరుడు(2011)
విజేత(2012)
ఎదురులేని అలెగ్జాండర్(2012)
చూడాలని.. చెప్పాలని(2012)
మహా భక్త సిరియాలా(2014)
కాకతీయుడు(2015)
ఎవరు(2016)
మనమంతా(2016)
రాజా చేయి వేస్తే(2016)
కయ్యూం భాయి(2017)
దేవినేని(2021)
సారథి(2022)

2022లో 9 అవర్స్ సిరీస్‌లోనూ నటించారు. అమరావతి సినిమాలో నటనకు బెస్ట్ విలన్‌గా నంది అవార్డ్ అందుకున్నారు తారకరత్న.