Taraka Ratna : తారక రత్న చెల్లి మాటలు వింటుంటే.

Taraka Ratna : ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వారి గుండెచప్పుడు.. విశ్వవిఖ్యాత నటసారభామ అన్నా అని పిలిస్తే కదలి వచ్చే ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు శతజయంతోత్సవాలు మనకి పెద్దగా పండుగ.. చలనచిత్ర రంగం ప్రవేశం చేసి భారత చలనచిత్ర చరిత్ర తిరగరాసిన ధ్రువతార .. ఎన్నో చిత్రాలు తరించారు.. ఎన్నో పాత్రలు ఆణిముత్యాలు.. ముఖ్యంగా రాముడు కృష్ణుడు అంటే భారతదేశంలోనే కాదు.. మొత్తం యావత్ ప్రపంచానికి గుర్తుకు వచ్చేది మన అన్నగారు ఒక్కరే..

ఆ తెలుగు తేజం ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన ఆశీస్సులతో ఈ రోజున శతజయంతోత్సవాలకు విచ్చేసిన అభిమానులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తారకరత్న చెల్లెలు తెలుగులో అనర్గళంగా మాట్లాడి ఆ సభకు విచ్చేసిన అందరిని ఆశ్చర్యపరిచారు.

నందమూరి తారకరామారావు కొడుకు అయిన మోహన్ కృష్ణకు తారకరత్న జన్మించారు. మోహన్ కృష్ణ సైతం ఇండస్ట్రీలోనే ఉన్నారు ఛాయాగ్రహకుడిగా చాలా ఏళ్లు సినిమాలకు పనిచేశారు. మోహన్ కృష్ణకు ఇద్దరు సంతానం. కొడుకు తారకరత్న కాగా కుమార్త పేరు రూప. తారకరత్నకు చెల్లెలు రూప అంటే పంచప్రాణాలు. తారకరత్న అలేఖ్య అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి మోహన్ కృష్ణ కుటుంబానికి ఇష్టం లేకపోవడంతో చాలా ఏళ్లపాటు కుటుంబానికి తారకరత్న దూరంగా ఉన్నాడు.

మోహన్ కృష్ణ కూతురు రూప వివాహం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి సమయంలోనే తారకరత్న మల్లి కుటుంబంతో కలిసి పోయారు. అప్పటినుంచి అలేఖ్య కూడా నందమూరి కుటుంబానికి దగ్గర అయింది. ఇటీవల తారకరత్న మరణం తో నందమూరి నారా కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.