Balakrishna : నందమూరి తారకరత్నకు హార్ట్ ఎటాక్ రాగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆయన గుండె ఎడమ కవాటం 90 శాతం బ్లాక్ అయ్యిందని అలాగే జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధి కూడా వచ్చింది అంటూ వైద్యులు నిర్ధారించారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. తారకరత్నకు షుగర్ ఉండడం వల్ల వైద్యం అందించడంలో వైద్యులు ఇబ్బంది పడుతున్నట్లు తాజా సమాచారం. ఇదిలా ఉండగా ఆయనకు ఇటీవల బ్రెయిన్ సర్జరీ జరిగిందని.. స్కాన్ రిపోర్టు రాగానే విదేశాలకు తీసుకెళ్ళనున్నారు అంటూ కూడా వార్తలు బాగా వినిపిస్తున్న నేపథ్యంలో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి.. తన మామయ్య బాలయ్య తో మాట్లాడుతూ ఏడుస్తూ ఇలా అన్నారట..
” చాలా రోజులు అయిపోయింది కదా మావయ్యా .. ఎయిర్ అంబులెన్స్ లో విదేశాలకు తీసుకెళ్లి ఆయనకు చికిత్స చేయిద్దాం ” అంటూ బాలయ్యతో తారకరత్న భార్య ఏడుస్తూ చెప్పినట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమంగానే ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయనకు పదిమంది ప్రత్యేకమైన వైద్య బృందంతో తారకరత్నకు ప్రత్యేక వైద్యం జరిగింది. ఇప్పటికీ కూడా వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తారకరత్నను జూనియర్ ఎన్టీఆర్, విజయసాయిరెడ్డి, కళ్యాణ్ రామ్, బాలకృష్ణ తదితరులు కుటుంబ సభ్యులను కూడా తారకరత్న ఆరోగ్య విషయంపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆయన త్వరగా కోలుకోవాలని కూడా కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రేమికులు, రాజకీయ నాయకులు, ప్రేక్షకులు కూడా కోలుకుంటున్నారు. అంతేకాదు ప్రస్తుతం తారకరత్న వైద్య చికిత్సకు.. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇప్పటికే కోటి రూపాయలకు పైగా వెచ్చించినట్లు తెలుస్తోంది.