Taraka Ratna : టిడిపి యువనేత లోకేష్ యువగళం పాదయాత్రలో నడుస్తూ తారకరత్న సొమ్మసిల్లి పడిపోవడం, ఆసుపత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా నిర్ధారించడంతో.. టీడీపీ శ్రేణులు , నందమూరి అభిమానులు ఆందోళనకు లోనయ్యారు. అయితే నిన్న మొన్నటిదాకా.. అంతెందుకు లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన తారక రత్నకు గుండెపోటు రావడం ఏంటని అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.. తారకరత్న హార్ట్ లో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చిందని చికిత్సలు అందిస్తున్న వైద్యులు తెలిపారు.. గుండెలో కుడి ఎడమవైపు 95 శాతం బాక్స్ ఉన్నట్లు పేర్కొన్నారు..
టిడిపి పార్టీ కార్యక్రమాల్లో నందమూరి తారకరత్న చురుగ్గా పాల్గొంటున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ఆయన ఎప్పటికీ ప్రకటించారు. లోకేష్ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు స్వయంగా కుప్పం వెళ్లి మరి అన్ని తానే చూసుకున్నారు. మరోవైపు పార్టీ నేతలు కూడా తారకరత్న కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. నందమూరి తారకరత్న ఎలక్షన్స్ లో పోటీ చేయాలని డిసైడ్ అవ్వాలని అసెంబ్లీ సీటు ఇవ్వడానికి టిడిపి అధిష్టానం కూడా సుముఖంగానే ఉంది. తారకరత్నకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అని తెలిసినా కొంతమంది ఎవరో తారకరత్నకు చేటు చేయాలని చూశారని ప్రచారం జరుగుతోంది.
తారకరత్న స్పృహ తప్పలేదని ఆయన పై విష ప్రయోగం జరిగిందని చెప్పుకొస్తున్నారు టిడిపి నేతలు. దీనికి కారణం ఆయన శరీరం నీలం రంగులో కి మారడమే కారణమని తెలుస్తోంది. యువగళం యాత్ర ప్రారంభించే ముందు తీర్థప్రసాదాలు తారకరత్న తీసుకున్నారని.. ఆ కారణంగానే తారకరత్న పల్స్ పడిపోయిందని.. ఆయన కండిషన్ క్రిటికల్ గా మారిందని.. సుమారు 45 నిమిషాల పాటు ఆయనకు పల్స్ అందలేదని.. కాగా ఆయనను యధావిధిస్థితికి తీసుకోరాడానికి.. డాక్టర్ చాలా కష్టపడ్డారని సమాచారం.
నిజానికి షెడ్యూల్ ప్రకారం తారకరత్న ఈ పాదయాత్రలో పాల్గొనకూడదు.. 48 గంటలు ముందే ఆయన ఈ షెడ్యూల్ ని పెట్టుకున్నారు. ఈలోపే ఇలా జరగడం ఏపీ పాలిటిక్స్ లోనే సంచలనంగా మారింది. ఆయనంటే గిట్టని వాళ్ళు కొందరు ఇలా ఆయనపై విష ప్రయోగం చేశారని సోషల్ మీడియాలో టిడిపి తమ్ముళ్లు చెప్పుకొస్తున్నారు. తారకరత్న పై ఎవరో దగ్గర వాళ్ళే ఇలా పక్కా ప్లాన్ తో స్కెచ్ వేసి మరి విష ప్రయోగం చేశారన్నది టిడిపి తమ్ముళ్ల వాదన దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. తారక రత్న త్వరగా కోలుకోవాలని అందరూ దేవుడిని ప్రార్ధిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు బాలకృష్ణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు తాజాగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా తారకరత్న హాస్పిటల్ కి వెళ్లి వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు . జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ ముందే భావోద్వేగానికి లోనయ్యారని తెలుస్తోంది.