Taraka Ratna: టిడిపి నాయుకుడు నందమూరి తారక రత్న నాలుగు రోజులగా యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర పనులను దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. కాగా గురువారం యువగళం పాదయాత్ర లో నడుస్తూ తారకరత్న సొమ్మసిల్లి పడిపోవడం.. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా నిర్ధారించడంతో.. టీడీపీ శ్రేణులు , నందమూరి అభిమానులు ఆందోళనకు లోనయ్యారు.
తారకరత్న కు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకువెళ్లారు. శుక్రవారం రాత్రి ఆయన భార్య అలేఖ్య రెడ్డి, కుమార్తె ఆసుపత్రికి వచ్చారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తీసుకు వెళ్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో డాక్టర్లతో పాటు అందరితో చర్చించి తారకరత్నతో భార్య అలేఖ్యరెడ్డి నిర్ణయం తీసుకున్న తర్వాత.. ఆయనను బెంగుళూరు తీసుకెళ్లారు. నారాయణా హృదయలయా హాస్పిటల్ కి తీసుకు వెళ్లిన వెంటనే వైద్యులు తగిన వైద్య పరీక్షలు నిర్వహించారు..
అప్పటికే 95 శాతం రక్తకణాలు మూసుకుపోయయాట, ఊపిరితిత్తులు కూడా పాడైపోయాయట.. వైద్యులు తారకరత్న పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పడంతో.. ఆయనకు ఏక్మో ద్వారా ఇవ్వడానికి భార్య అలేఖ్య రెడ్డి ఒప్పుకున్నాడట. కొన్ని విషయాలు బయటకు రావడం లేదు కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే గుండెకి బ్లడ్ సర్కులేషన్ అనేది ప్రాపర్ గా లేదు అన్నప్పుడు.. ఎక్మో ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది.
ఇప్పుడు భారతరత్న గుండె పని చేయడం పూర్తిగా ఆగిపోయిందట ఇక ఆయన భార్య అలేఖ్య రెడ్డి అంగీకారంతో ఎక్కువ ట్రీట్మెంట్ జరుగుతుందనీ తాజా సమాచారం.. నందమూరి తారకరత్న అభిమానులు టిడిపి నేతలు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని పలు దేవాలయాలలో చర్చిలలో ఆయన పేరిట ప్రార్థనలు జరుగుతున్నాయి. మనందరం కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితిని మెరుగుపదాలని కోరుకుందాం.