Taraka Ratna: నందమూరి తారకరత్న నారా లోకేష్ యువగళం పాదయాత్రలో సమస్యలు పడిపోవడం ఆయన పరిస్థితి విషమంగా మారిన సంగతి తెలిసిందే. ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని బెంగళూరు నారాయణ హృదయలయ వైద్యులు తెలిపారు. మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ తర్వాత కార్డియోజెనిక్ కారణంగా ఆయన పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని తెలిపారు.. కాగా తారకరత్న కి ఉన్న ఆ అలవాటే పరిస్థితి ఈరోజు ఇంతవరకు తీసుకు వచ్చిందని సమాచారం అందుతోంది.
తారకరత్న డే అండ్ నైట్ మొత్తం మద్యం తాగడం వల్లే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని.. ఇదే సమయంలో గుండు పోటు రావడంతో ఆయన కోలుకోలేకపోతున్నాడు అంటూ కుటుంబ సభ్యులతో తారకరత్న ఆరోగ్య విషయం నారాయణ హృదయాలయ వైద్యులు చెప్పారట. తారకరత్న కి ఉన్న డ్రింకింగ్ హెబిటే ఈరోజు పరిస్థితి ఇక్కడ వరకు తీసుకొచ్చిందని సమాచారం.
కాగా.. నందమూరి తారకరత్నకు ఒకప్పుడు డ్రింకింగ్ హ్యాబిట్ ఉండేదని. తన కూతురు పుట్టిన తరువాత తన లైఫ్ స్టైల్ మొత్తం పూర్తిగా మార్చేసారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పుడు పార్టీలకు తప్ప ఆయన మందు తాగడం లేదని.. అయితే ఇటీవల ఆయన ఆధ్యాత్మికంలోకి వచ్చారని.. అప్పటినుంచి మందు తాగడం పూర్తిగా మానేశారని.. అలాగే ఆయన కట్టు బొట్టు మొత్తం మార్చేశారని.. మెడలో రుద్రాక్ష మాలలు నుదుటిన విభూది తిలకం ధరిస్తున్నారని.. ప్రస్తుతం నందమూరి తారకరత్నకు డ్రింకింగ్ హ్యాబిట్ లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు .
ఒకప్పుడు ఉన్న ఈ అలవాటు కారణంగానే నందమూరి తారకరత్నకు ఈ పరిస్థితి వచ్చిందని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగానే ఉందని ఆయనను చూసి వచ్చిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఆయనకు ప్రతి ఒక్కరి ప్రార్థనలు అవసరమని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు నందమూరి తారకరత్న అభిమానులు, అందరి ప్రార్థనల వలన తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మనందరం కూడా కోరుకుందాం.