Alekhya Reddy : టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న టిడిపి యువనేత లోకేష్ యువగళం పాదయాత్రలో నడుస్తూ తారకరత్న సొమ్మసిల్లి పడిపోవడంతో.. ఆసుపత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా నిర్ధారించారు. తారకరత్న హార్ట్ లో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చిందని చికిత్సలు అందిస్తున్న వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నందమూరి తారకరత్న బెంగళూరు నారాయణ హృదయాలయ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే..

నందమూరి తారకరత్న ఆరోగ్య విషయంలో బాలకృష్ణ దగ్గరుండి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు నారా కుటుంబ సభ్యులు అలేఖ్య రెడ్డి బంధువులు కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నారు.. మరోవైపు ఆయనకు మెరుడైన వైద్యం అందించడం కోసం విదేశాలకు తీసుకెళ్తే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు..
ప్రముఖ జ్యోతిష్యులు మీడియాతో మాట్లాడుతూ తారకరత్న ఆరోగ్యం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తారకరత్న పై శని ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. అంటూ ఆమె చెప్పుకొచ్చారు. తారకరత్న పై ఎంత శని ప్రభావం ఉన్న మంచి కోరుకునే వ్యక్తుల వల్లే దేవుడు ఇలాంటి అద్భుతాలు చేసి ఆయనని ప్రాణాపాయం నుంచి తప్పించాలని చెప్పుకొచ్చారు. విదేశాలకు తీసుకెళ్లడం వల్ల మార్పులు జరుగుతా యని స్థానబలం మారితే ఆయన మరింత త్వరగా కోలుకుంటారని తెలిపింది.
ఇప్పుడు గురు దత్తాత్రేయ ను పూజిస్తే మృత్యువు నుంచి బయటపడతారని పితృ దోషాల వల్లే ఇలాంటి తరహా ఘటనలు జరుగుతూ ఉంటాయని.. ఇలాంటివి ఇకపై జరగకుండా ఉండాలంటే నారాయణ బలి పూజ చేయాలి.. అప్పుడే ఆ దోషాలు పూర్తిగా తొలగిపోతాయని అంటూ ఆ జ్యోతిష్కురాలు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ విషయం తెలుసుకున్న అలేఖ్య రెడ్డి నారాయణ బలిపూజ చేస్తుందా.. లేదంటే ఆమె చెప్పినట్టు విదేశాలలో ట్రీట్మెంట్ ఇప్పిస్తుందా అనేది చూడాలి. నందమూరి తారకరత్న ఫాన్స్ తో పాటు టిడిపి నేతలు కూడా ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.