Tollywood News : కెమెరా ముందే కాదు వెనుక నటించినా డబ్బులే అంటున్న స్టార్ హీరోయిన్..!

Tollywood News : సినీ ఇండస్ట్రీలో నటిస్తేనే వాళ్ళ కెరియర్ బాగుంటుంది. కానీ కెమెరా ముందు నటించడం వేరు. కెమెరా వెనక నటించడం వేరు.. కెమెరా ముందు నటిస్తే మహానటి అంటారు.. కెమెరా వెనక నటిస్తే టక్కులాడి అంటారు.. సినీ ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్లు మొహానే మాట్లాడే హీరోయిన్స్ మన ఇండస్ట్రీలో చాలా తక్కువ. వాళ్లలో ముందుండేది తాప్సి. తాజాగా తాప్సీ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Tapsi viral comments on one star heroine
Tapsi viral comments on one star heroine

ఝుమ్మంది నాదం అనే సినిమాతో తెలుగు జరుకు పరిచయమైంది తాప్సి ఆ తరువాత విభిన్న పాత్రలో నటిస్తూ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. తాప్సీ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. నేను కెమెరా ముందు మాత్రమే నటించగలను.. నాకు తెర వెనుక నటించడం నాకు రాదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం నా అలవాటు. అఫ్ కోర్స్ అలా వెనక నటించిన వాళ్లే ఇండస్ట్రీలో ముందు వరుసలో ఉంటారు.. అని మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

తాప్సి టాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్ గా తనతో పాటు బాలీవుడ్ కి వెళ్ళిన ఓ హీరోయిన్ గురించే ఇలాంటి కామెంట్స్ చేసింది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ హీరోయిన్ ఇక్కడ పెద్ద పెద్ద హీరోలతో నటించి ప్రజెంట్ బాలీవుడ్ లో చక్రం తిప్పుతుంది. బాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆ హీరోయిన్ ని స్టార్ హీరో మధ్య ఏదో నడుస్తోంది అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తాప్సి కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం సంచలనంగా మారాయి..