Tammareddy bharadwaj : నాగబాబు, రాఘవేంద్ర రావు కి స్ట్రాంగ్ కౌంటర్ వీడియో వదిలిన తమ్మారెడ్డి..

Tammareddy bharadwaj : రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్, సీటల్ ఫిల్మ్ క్రిటిక్ వంటి అవార్డ్స్ తో పాటు నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ సినిమాపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వివాదంగా మారాగా.. వాటిపై నటుడు నిర్మాత నాగబాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇద్దరు స్పందించారు. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ వీరిద్దరికీ కౌంటర్ ఇస్తూ వీడియో పోస్ట్ చేశారు..

Advertisement
Tammareddy bhardwaj counter video on RRR nagababu raghavendra Rao
Tammareddy bhardwaj counter video on RRR nagababu raghavendra Rao

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడిన మాటలకు నాగబాబు నీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టాడా, రాజమౌళిని చూసి జలస్ ఫీల్ అవుతున్నావని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా డైరెక్టర్ రాఘవేంద్రరావు కూడా నీకు అకౌంట్స్ తెలుసా అని తమ్మారెడ్డిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. దాంతో తమ్మారెడ్డి నాకెందుకు జలసి.. నేనేదో కృష్ణా రామా అని బతుకుతున్నాను. నేను ఎవరిని ఒక్క మాట అనను. కానీ నన్ను ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటున్నారు. నాకు ఈ అకౌంట్స్ తెలుసా అని అన్నారు. నాకు చాలా మంది అకౌంట్స్ తెలుసు. ఎవడెవడు ఎవడెవడిని ఏ అవార్డుల కోసం ఏం అడుక్కున్నారో.. ఏ పదవులు కోసం ఏం అడుక్కున్నారో.. ఎవరెవడి కాళ్లు పట్టుకున్నారో అన్నీ నాకు తెలిసు. ఇవన్నీ నేను మాట్లాడను.

Advertisement

మరొకరు మీ అమ్మ మొగుడు అని అన్నారు. మా అమ్మ మొగుడు నాకు మర్యాద, సంస్కారం, నీతిగా బతకడం నేర్పించాడు. అందుకే నేను మాట్లాడకుండా నా సంస్కారం ఆపేస్తుంది అని ఆయన అన్నారు. నేను రాజమౌళి గారు గొప్పవాడన్నప్పుడు మీకు అది తెలియదా.. ఎవడో ముక్క కట్ చేసి పెడితే తెలిసిందా మీకు అంటూ ఎద్దేవా చేశారు. నాగబాబు, రాఘవేంద్ర రావు పై చేసిన కౌంటర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement