Tamannah : తమన్నా నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా చాలా క్రేజ్ ఉంది. మిల్క్ బ్యూటీ అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. నటన, గ్లామర్ మాత్రమే కాదు తమన్నా అద్భుతంగా డాన్స్ చేస్తారు. టాలీవుడ్ టాప్ డాన్సర్లు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రామ్ లతో పోటాపోటీగా డాన్స్ చేయగల ఏకైక హీరోయిన్ తమన్నానే. ఈ బ్యూటీ వెండితెరకు పరిచయమై 17 ఏళ్లకు గడిచిన ఫేమ్, పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. నిజంగా తమన్నకు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది..
తమన్నా గత కొంతకాలం విజయ్ వర్మ తో డేటింగ్ చేస్తోంది. ఈ విజయ్ వర్మ ఎవరో కాదు నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఎంసీఏ సినిమాలో విలన్ గా నటించారు. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు లవ్ స్టోరీస్ 2 అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారినట్లు బాలీవుడ్ మీడియా లో జోరుగా ప్రచారం జరుగుతోంది..
అప్పటినుంచి ఇద్దరు కలిసి డేటింగ్ చేస్తున్నారు అంటూ వారి పేర్లు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక న్యూ ఇయర్ సందర్భంగా వీళ్ళిద్దరూ కలిసి చేసిన లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.. ఇదిలా ఉంటే ఈ జంట త్వరలోనే వెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది..
ఇక ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో తమన్నాకు తన సినిమాలో నటించిన ఆఫర్ ఇచ్చారట.. కాగా ఈ స్టార్ హీరోతో తమన్నా గతంలో లవ్ ట్రాక్ నడిపిందని టాక్ కూడా ఉంది. అయితే తమన్నా పెళ్లికి ముందే మరోసారి ఈమెకు ఛాన్స్ ఇవ్వడంతో ఈ హీరో పై వార్తలు వైరల్ అవుతున్నాయి.. తమన్నాపై ఆ హీరోకి ఇంకా మోజు తీరలేదేమో.. అందుకే ఆమెకు సినిమా ఆఫర్ ఇచ్చాడంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు.