Sushanth Singh :
బాలీవుడ్ అంతా కలిసి సుశాంత్ సింగ్ ను పొట్టన పెట్టుకుందని అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు.. హత్యే అంటూ సోషల్ మీడియా గొంతెత్తి చెబుతోంది. సుశాంత్ తల్లిదండ్రులు, సోదరి కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కానీ అతని మరణం సూసైడ్ అని ముంబై పోలీసులు తేల్చి చెప్పిన విషయం అందరికి తెలిసిందే.. అయితే జనవరి 21 న సుశాంత్ పుట్టినరోజు.. దాంతో ఆయన మరణం పై ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి.. తాజాగా సుశాంత్ ది ఆత్మహత్య కాదు.. హత్యే అంటూ నాడు పోస్ట్ మార్టంలో పాల్గొన్న కూపర్ హాస్పిటల్ ఉద్యోగి చెబుతున్న మాటలు, వాటికి సంబంధించిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
సుశాంత్ కేస్ రియా చక్రవర్తి చుట్టూనే తిరిగింది. సుశాంత్ మేనేజర్ దిశా సలియాన్‌ది కూడా హత్యనా? ఆత్మహత్యనా? అనేది తేల్చి లేకపోయారు. కాగా రియా చక్రవర్తి మహేష్ భట్ ఫోటోలు వైరల్ అవ్వడం.. రియా సుశాంత్ కి డ్రగ్స్ ఇవ్వడం ఇలా ఈ కేసులో ఎన్నెన్నో కోణాలు బయటకు వచ్చాయి.
సుశాంత్ డెడ్ బాడీ వచ్చిన రోజే మరో నాలుగు కేసులు కూడా వచ్చాయట. ముందు అది సుశాంత్ బాడీ అనుకోలేదట. కానీ సుశాంత్ బాడీ అని తెలిశాక.. చూసిన మొదటి క్షణంలోనే అది సూసైడ్ కాదని, మర్డర్ అని అర్థమైందట.. మెడ మీద గాట్లు కూడా కనిపించాయట. ఇదే విషయాన్ని తన పై అధికారులకు కూడా చెప్పాడట. కానీ వారి ఆదేశాల మేరకు పని చేశాడట. ఫోటోలు తీసి పోలీసులకు ఇవ్వమని చెప్పాడట. అలానే చేశాడట. ఆ తరువాత పై అధికారులు చెప్పినట్టుగా పోస్ట్ మార్టం చేశాడట.
మొత్తానికి ఇప్పుడు ఈ విషయాలు మాత్రం జాతీయ మీడియాను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. దీంట్లో ఎంత నిజం ఉందనే విషయాన్ని పోలీసులు విచారించాల్సి ఉంది. అయితే ఈ పోస్ట్ లపై నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ విషయం మాకు ఎప్పుడో తెలుసు.. మేం ఇన్నాళ్లుగా చెబుతున్నది కూడా అదే అంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు.