Super Star krishna : సూపర్ స్టార్ ఫ్యాన్స్ విజిల్స్ వేసే వీడియో..! అటు కృష్ణ ఇటు మహేష్..!

Super Star krishna : టాలీవుడ్ లెజెండరీ స్టార్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే.. ఆయన గురించి పట్ల టాలీవుడ్ మొత్తం ఘన నివాళి అర్పించింది. 350 పైన చిత్రాలు నటించిన నటశేఖరుడికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగువారి సైతం నివాళులు అర్పించారు. నిర్మాతల నటుడిగా ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించిన సూపర్ స్టార్ కృష్ణ సినీ ప్రస్థానం ఓ చరిత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇప్పటికే తెలుగు పరిశ్రమ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే ఉంది.. తాజాగా సూపర్ స్టార్ అభిమానులు ఎడిట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..దివంగత సూపర్ స్టార్ కృష్ణ ఒకవైపు మహేష్ బాబు నటించిన సినిమాలోని సన్నివేశాలతో ఓ ఆసక్తికర వీడియో రూపొందించారు..

super-star-krishna video viral
super-star-krishna video viral

అందరికీ మెమొరబుల్ గా నిలిచేలా నాటి సూపర్ స్టార్ కృష్ణతో ఆయన తనయుడు నేటి సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిపి వారిద్దరి పలు సినిమాలోని ఒకటే విధంగా ఉండే కొన్ని సన్నివేశాలు తీసుకొని వాటిని ఒక అద్భుతమైన మేషప్ గా ఎడిట్ చేశారు. కొందరు సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా వాటిని సూపర్ స్టార్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అటు కృష్ణ గారు ఇటు మహేష్ బాబు ఇద్దరూ పలు రకాల గెటప్స్ లో ముఖ్యంగా రైతుగా, కౌబాయ్ గా, అల్లూరి సీతారామరాజు గా ఇలా వాళ్ళిద్దరి పలు సినిమాలోని సీన్స్ కలిపి రూపొందించిన వీడియో నెట్టింట అందరినీ ఆకట్టుకుంటుంది.

ఆనాటి కృష్ణ నటించిన చిత్రాలలోని సన్నివేశాలతో మహేష్ బాబు నటించిన వాటిని కలిపి చేసిన ఎడిట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ వీడియో మహేష్ తన తండ్రి గురించి చెప్పిన మాటలు ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు అవుతుంది. రెండు కళ్ళు చాలా అంటే నమ్మండి.