Singer Sunitha : సింగర్ సునీత గురించి టాప్ సీక్రెట్ : నలభై ఏళ్ల వయసులో కూడా ఇంత పిచ్చెక్కించే బ్యూటీ తో ఎలా ఉంది !

Singer Sunitha : ప్లే బ్యాక్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న సింగర్ సునీత సంగీత నేపథ్యం బ్యాక్ గ్రౌండ్ కలిగిన కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది. ముఖ్యంగా సునీత మాట్లాడడంలో మంచి నేర్పరి.. అందుకే ఒక సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. గుంటూరులో పుట్టి పెరిగిన సునీత మొదట గుంటూరు, విజయవాడ ప్రాంతాలలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి.. 8 సంవత్సరాల వయసులోనే సంగీత విభాగంలో ప్రావీణ్యం పొంది.. కేంద్ర ప్రభుత్వం అందించే సాంస్కృతిక విభాగంలో మెరిట్ స్కాలర్షిప్ ని కూడా సొంతం చేసుకుంది.

Sunitha top beauty secrets was leaked.. girls also following..!
Sunitha top beauty secrets was leaked.. girls also following..!

అలా 15 సంవత్సరాల చిరుప్రాయంలోనే చిత్ర పరిశ్రమకు గాయనిగా పరిచయమైన సునీత.. అనేక టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, సహాయ దర్శకురాలిగా కూడా పలు బాధ్యతలు నిర్వహించింది. ఇంత చిన్న వయసులోనే సింగర్ గా గుర్తింపు తెచ్చుకోవడం ఆమెకే చెల్లిందని చెప్పవచ్చు. గులాబీ, ఎగిరే పావురమా వంటి సినిమాలతో మంచి గాయనిగా పేరు తెచ్చుకున్న సునీత ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ అనేకమంది తెలుగు హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పడమే కాకుండా సుమారుగా 700 సినిమాలకు డబ్బింగ్ చెప్పినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా తాజాగా సునీత గురించి ఒక టాప్ సీక్రెట్ బయటకు వచ్చింది.నలభై ఏళ్ల వయసులో కూడా ఇంత పిచ్చెక్కించే బ్యూటీ తో ఎలా ఉంది అని ఆలోచించే అమ్మాయిలకు సునీత బ్యూటీ సీక్రెట్స్ బయటకు రావడం గమనార్హం. సునీత అందం, చందం రెండూ కలగలిసిన బుట్ట బొమ్మలా ఉంటుంది . నిజానికి ఈమెను చూసి హీరోయిన్లు సైతం కుళ్లుకుంటారు అంటే నమ్మి తీరాల్సిందే. అంతలా ఆమె గొంతుతో పాడుతూ కళ్ళతో అభినయించినట్టు కనబడుతూ ఉంటుంది.. ఆమె కళ్ళల్లో మెరుపు చూస్తే ఎంతటి వారైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అయితే ఈమె ఇంత అందంగా ఉండడానికి కారణం ఆమె కళ్ళేనట. ఆమె కళ్ళకు పెట్టిన కాటుకే ఆమె అందానికి కారణమవుతుందట. ఈ విషయం తెలిసి అమ్మాయిలు వెంటనే ఫాలో అవుతున్నారని కూడా సమాచారం.