Singer Sunitha : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గాయనిగా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న సునీత.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్లతో సమానంగా ఫాలోయింగ్ ను అందుకుంటుంది. కొంతమంది హీరోయిన్ల కంటే సోషల్ మీడియాలో ఆమెకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. నిజానికి సునీత గాత్రానికే కాదు ఆమె రూపానికి కూడా అభిమానులు ఉన్నారు. అందుకే సునీత వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడుతూ ఉంటారు.
ఈ నేపథ్యంలోని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పుకార్లు కూడా ఎప్పటికప్పుడు మరింత వైరల్ గా మారుతూ ఉంటాయి. అయితే ఈ పుకార్ల వల్ల అటు సింగర్ సునీత ఎంతగా మానసికంగా ఇబ్బంది పడుతుందో అనేది కూడా లేకుండా కొంతమంది విచక్షణా రహితంగా కథనాలు రాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని సునీత ప్రెగ్నెంట్ అయింది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆసక్తికర కామెంట్లు చేసింది సునీత.
ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత మాట్లాడుతూ..” నేను నిజంగానే ప్రెగ్నెంటా..? ఆ విషయం నాకు కూడా తెలియదే.. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయితే డెలివరీ డేట్ కూడా ఎప్పుడో చెప్పండి.. ” అంటూ ఊహించని విధంగా కామెంట్లు చేసింది.. అంతే కాదు ఆమె మాట్లాడుతూ.. “ఇటువంటి పుకార్లను పుట్టిస్తున్నారు అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో.. అది వాళ్ళకే వదిలేస్తున్నాను.. అలాంటి వాళ్ళు నన్ను నా జీవితాన్ని ఏమీ చేయలేరు ” అంటూ సునీత తెలిపింది.
సునీత ప్రెగ్నెన్సీ గురించి ఇది రెండోసారి వార్త రావడం.. గత ఏడాది ఏప్రిల్ నెలలో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి.. కానీ ఇప్పుడు కూడా ఇలాంటి వార్తలు వచ్చేసరికి ఆమె రంగంలోకి దిగి వాటిని ఖండించారు. మొత్తానికైతే ఇలాంటి వార్తలకు ఆమె చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు.