Suma : కొన్ని దశాబ్ధాలుగా ప్రేక్షకులని తన మాటలతో అలరిస్తూ వస్తున్న యాంకరమ్మ సుమ. ఏదైన సినిమా ఈవెంట్‌ని సుమ హోస్ట్ చేస్తుందంటే ఆ సందడే వేరుగా ఉంటుంది.. ముఖ్యంగా దర్శక నిర్మాతలు, ఈవెంట్ మేనేజర్లు ఫుల్ రిలాక్స్ అయిపోతారు. ఎలాంటి సినిమా అయినా సుమ హోస్టింగ్ చేస్తుందంటే ఆ షోని నెక్స్ట్ లెవల్‌కి తీసుకుని వెళ్తుంది. ఏళ్లకి ఏళ్లుగా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ బిగ్ ఈవెంట్ హోస్ట్ కావడంతో అగ్ర దర్శకులు, బడా నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం సుమతో యాంకరింగ్ చేయించాలని భావిస్తారు. ఆడియో ఫంక్షన్స్ మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పలు షోస్‌తో సందడి చేస్తుంది సుమ.

సుమ పంచ్ అదిరిపోలా..
ప్రస్తుతం సుమా వ్యాఖ్యాతగా ఈటీవీలో క్యాష్ అనే కార్యక్రమం వస్తున్న విషయం తెలిసిందే . ఎన్నో ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం ఎంతో టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుండగా, ఇందులో ప్రతివారం నలుగురు స్పెషల్ గెస్ట్ లను పిలిచి ఇక వారితో ఫన్నీ టాస్కులు ఆడిస్తూ ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటుంది సుమ. రీసెంట్గా తాజా ఎపిసోడ్‌కి సంబంధించి ప్రోమో విడుదల కాగా, ఈ ప్రోమో కాస్త తెగ వైరల్ గా మారిపోయింది. అయితే ఈ ప్రోమోలో చూసుకుంటే ఒక కాలేజీ కుర్రాడు ఏకంగా పువ్వు పట్టుకొని వచ్చి యాంకర్ సుమకి ఐ లవ్ యు అని అంటాడు.
సుమ ఆ కుర్రాడికి దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తుంది. ఈ వారం ఎపిసోడ్లో హరితేజ, ప్రభాస్ శ్రీను, హేమ, ప్రవీణ్ గెస్ట్ లుగా రాగా, ఈ క్రమంలోనే ఇక చివర్లో వారికి ఒక ఫన్నీ టాస్క్ ఇస్తుంది సుమ. దీంతో సుమాకి ప్రపోజ్ చేయమని ప్రవీణ్ కాలేజీ కుర్రాడికి చెప్పగా, దాంతో ఒక పువ్వు పట్టుకొని వెళ్లి నిన్ను ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాను. ఐ లవ్ యు సుమ అంటూ ఎంతో ఫీల్ తో చెప్పుకొస్తాడు సదరు కుర్రాడు. దీంతో వెంటనే స్పందించిన సుమా నువ్ మా అబ్బాయి క్లాస్మేట్ కదా అంటూ కౌంటర్ ఇవ్వడంతో అందరు తెగ నవ్వేసుకుంటారు.