Suma : కొంచెమైనా సిగ్గు లేదా ” అంటూ శ్రీముఖి కి పబ్లిక్ గా క్లాస్ పీకిన సుమ !

Suma: శ్రీముఖి.. ఇప్పుడున్న యాంక‌ర్స్‌లో చాలా క్రేజ్ ఉన్న భామ‌. ఒక‌ప్పుడు అర‌కొర‌గా అందాలు ఆర‌బోసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం తెగ ర‌చ్చ చేస్తుంది. హోస్టుగా కెరీర్‌ను మొదలు పెట్టినప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ చిన్నది.. వరుస అవకాశాలతో ఓ రేంజ్‌లో హంగామా చేస్తుంది. ఫలితంగా తీరిక లేని షెడ్యూళ్లతో ఫుల్ బిజీగా కాలం గడుపుతోంది. ఇక, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తూ కుర్రకారును హుషారెత్తిస్తోంది . రీసెంట్‌గా బీచ్‌లో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయ‌గా, అవి నెట్టింట రచ్చ చేశాయి.

suma-fire-on-sreemukhi
suma-fire-on-sreemukhi

శ్రీముఖిపై ఫైర్..

అయితే శ్రీముఖి అందాల ర‌చ్చ కొంద‌రిని అల‌రిస్తున్నా మరి కొంద‌రికి మాత్రం చిరాకు తెప్పిస్తున్నాయి. ప‌ద్ద‌తిగా ఉండేది పోయి ఏంది ఈ ర‌చ్చ అంటూ తిట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అభిమానులు, నెటిజ‌న్స్ మాత్రమే కాదు శ్రీముఖి క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ప్రదీప్ , సుమ కూడా ఆమె ఫోటోషూట్ పై మండిప‌డుతున్నట్టు స‌మాచారం. శ్రీముఖి ఎందుకు ఇలా త‌యారైంది, అస‌లు ఆమె ఫోటోషూట్స్ ఏంది అంటూ ప్రదీప్ , సుమ కూడా ఆమెపై మండిపడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

యాంకర్‌గా మారడానికి ముందే శ్రీముఖి ‘జులాయి’ అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీని తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో ఎంతో ముఖ్యమైన పాత్రలను పోషించ‌గా, ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గానూ నటించింది. అలా బిజీగా గడుపుతున్నప్పుడే సినిమాలకు విరామం ప్రకటించేసి యాంక‌ర్‌గా స‌త్తా చాటుతుంది. ప్ర‌స్తుతం శ్రీముఖి క్ష‌ణం లేనంత బిజీగా ఉంది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో సోష‌ల్ మీడియాతోను ర‌చ్చ చేస్తుంది.