Suhasini Maniratnam : అలనాటి అందాల నటి సుహాసిని ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకల మనసులు గెలుచుకున్నారు. ఆమె భర్త మణిరత్నం దేశం గర్వించే చిత్రాలు చేశారు. ఇప్పుడు ఆయన కలల గన్న ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు కాబోతుంది . ఈ సినిమా కోసం ఆయన మూడు దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్నారు. విక్రమ్, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ.. లాంటి స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కిన భారీ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 1’.
ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి, దాదాపు 34 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని ఎంతో ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ స్పీడ్ పెంచారు. తాజాగా తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నటి కమ్ దర్శకుడు మణి సతీమణి సుహాసిని ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. పొన్నియిన్ సెల్వన్ ప్రాజెక్టు మణిరత్నంకు ఎంతటి డ్రీం ప్రాజెక్టు అన్న విషయాన్ని ఆమె తన మాటల్లో చెప్పేశారు. ‘పెళ్లికి ముందు మణిరత్నంగారు ఒక పెద్ద బ్యాగ్ నాకు గిప్టుగా ఇచ్చారు. అందులో ‘పొన్నియిన సెల్వన్’ నవల ఐదు భాగాలుగా ఉంది.
Suhasini Maniratnam : డ్రీమ్ ప్రాజెక్ట్..
అదంతా చదివి ఒక్క లైన్ లో చెప్పమన్నారు. నేను ఐదు భాగాల్ని చదివి ఐదు లైన్లుగా రాసి ఇచ్చాను. ఇలాగేనా రాసేది? అన్నారాయన. అప్పుడు మా పెళ్లి ఆగిపోతుందేమో? అని భయపడ్డాను. కానీ పెళ్లైంది. మా పెళ్లైన 34 ఏళ్లకు ‘పొన్నియిన్ సెల్వన్ తీరు’ అంటూ చెప్పుకొచ్చారు. సుహాసిని చెప్పిన ఈ మాటలు చాలు.. మణిరత్నంకు ఈ సినిమా (రెండు భాగాలు) ఎంత ఇష్టమో ఇట్టే అర్థం కావటానికి. ఇక విక్రమ్ .. కార్తి .. జయం రవి అందరూ కూడా నాకు చాలా కాలంగా తెలుసు. ఇక రెహ్మాన్ మా ఫ్యామిలీకి సంబంధించినవారుగానే చెప్పుకోవాలి. మణిరత్నంగారితో ఆయనకి ఉన్న అనుబంధం సంగీతపరమైనది మాత్రమే కాదు .. దైవీకమైనదని నా ఉద్దేశం. ఈ సినిమాతో ఐశ్వర్యారాయ్ ని మరోసారి ప్రపంచమంతా పొగడబోతోంది” అంటూ చెప్పుకొచ్చారు.