Anchor Rashmi : సుడిగాలి సుధీర్ రష్మీ సినిమా లో ఊహించని ట్విస్ట్..

Anchor Rashmi : బుల్లితెర పై సుడిగాలి సుధీర్ రష్మీ జంటకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా కాస్త మిగిలే ఉంటుంది. వీళ్ళని స్క్రీన్ పై చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారు.. జబర్దస్త్ షో లో రష్మీ సుధీర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మొదలైంది. ఢీ రియాలిటీ షోలో ఈ జంట చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. రష్మీ, సుధీర్ కలిసి స్కిట్ చేసినా, డ్యూయట్ లో కాలు కదిపినా ఫ్యాన్స్ కి పండగే.. వీళ్ళిద్దరూ కలిసి షోస్ నుంచి వీళ్ళ కోసమే షోస్ చేసే వరకు వచ్చారు..

విళ్లపై స్పెషల్ ఈవెంట్స్, స్కిట్స్ రూపొందించారు. రెండు సార్లు వీరికి ఉత్తుత్తి పెళ్లి కూడా చేశారు. పట్టుబట్టల్లో నిజమైన దంపతులకు ఏమాత్రం తగ్గకుండా సుధీర్ రష్మీ పెళ్లి జరిగింది. ఈ ఈవెంట్స్ ఎపిసోడ్స్ కి రికార్డు టీఆర్పీ తెచ్చిపెట్టాయి. సుధీర్ రష్మీ ని వెండి తెర పై చూడాలనేది వారిద్దరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.

సుధీర్ గాలోడు సినిమా ప్రమోషన్స్ లో త్వరలో రష్మి తాను కలిసి సినిమా చేయబోతున్నట్టు తెలిపారు. లేడీ ఓరియెంటెడ్ సినిమా లాగా ఈ సినిమా రూపొందుతుంది అని క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ సినిమాకి గజ్జెల గుర్రం అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

ఈ సినిమాలో రష్మీ వెనుక సుధీర్ కాకుండా సుధీర్ వెనుక రష్మీ పడుతుందట. అంటే బాహుబలి సినిమా లో అనుష్క ప్రభాస్ ను ఫాలో అయినట్టు.. మొత్తానికి ఈ సినిమా కథ ను వారి అభిమానులు సుధీర్ రష్మీ ని ఏ విధంగా అయితే చూడాలని అనుకుంటున్నారో.. అచ్చం అట్లానే వారిద్దరినీ చూపించనున్నారని సమాచారం