నా ప్రాణం ఉన్నంతవరకు మహేష్ బాబే నా దేవుడు: సుడిగాలి సుధీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

జబర్దస్త్ కామెడీ షో ద్వారా సూపర్ పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ హీరో స్థాయికి కూడా ఎదిగాడు. బుల్లితెర రంగంలో ఈ నటుడికి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మరెవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఒకానొక సమయంలో సుధీర్ కి పవన్ కళ్యాణ్ రేంజ్‌లో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అది చూసి అనసూయ కూడా అవాక్కయ్యింది. దీని అంతటికి కారణం సుధీర్ మంచి వ్యక్తిత్వం, అలాగే అతని హార్డ్ వర్కింగ్ నేచర్‌ అని చెప్పవచ్చు.

అయితే సుడిగాలి సుధీర్ ఇటీవల గాలోడు సినిమాతో బాక్సాఫీస్ హిట్టు కొట్టాడు. ఈ మూవీ చూసిన అభిమానులు సుడిగాలి సుధీర్ కి బాగా సపోర్ట్ చేశారు. అన్నా నీ వెంట మేముంటాం. నువ్వు ఎన్ని సినిమాలు చేసినా.. సపోర్ట్ చేస్తాం అని అతడికి మంచి బూస్ట్ ఇచ్చారు. అయితే గాలోడు సినిమా సూపర్ హిట్ కావడంలో మహేష్ బాబు పాత్ర ఎంతో ఉందని తాజాగా సుడిగాలి సుధీర్ తెలిపాడు. మహేష్ బాబు సినిమా ప్రమోషన్లలో ఎంతో సహాయం చేయడం వల్లనే తన సినిమా ప్రజల్లోకి అంతగా వెళ్లిందని పేర్కొన్నాడు. నా ప్రాణం ఉన్నంతవరకు మహేష్ బాబును నా దేవుడుగా భావిస్తానని ఎమోషనల్ వ్యాఖ్యలు చేశాడు.

అయితే మహేష్ బాబు మంచి వ్యక్తిత్వం, అలాగే టాలెంట్ ఉన్న వారిని బాగా సపోర్ట్ చేస్తుంటాడు. ఇందులో భాగంగానే సుదీర్ కి కూడా తన వంతుగా సపోర్ట్ చేశాడు. అయినా తనలాంటి చిన్న హీరోని అంత గొప్ప స్థాయిలో ఉన్న మహేష్ సపోర్ట్ చేయడం తనకు ఎంతో నచ్చిందని సుధీర్ ఎమోషనల్ అయ్యాడు. మహేష్ అంత మంచి మనసున్న వ్యక్తి మరెవరు ఉండరని కూడా కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.