Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. జబర్దస్త్ కమెడియన్ గా స్మాల్ స్క్రీన్ కు పరిచయమైన సుధీర్ ఆ తరువాత యాంకర్ గా, నటుడిగా మరి ఇప్పుడు హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇప్పటివరకు తెలుగు టెలివిజన్ నటులకు ఎవరు పొందని విజయాన్ని గాలోడు సినిమా ద్వారా సుధీర్ అందుకున్నాడు..

నిజానికి ఇది గాలోడు గొప్ప సినిమా ఏం కాదు. పైగా ఇంప్రెస్ చేసే స్టోరీ కాదు. ఆ సినిమాలో కథనం సరిగ్గా లేదు, ఇలా చాలా కామెంట్స్ వినిపించాయి. కానీ సుడిగాలి సుధీర్ గాలోడు సినిమా 11 రోజుల్లో 8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది. ఈ సినిమాని 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదల చేస్తే, టార్గెట్ పూర్తి చేసి, లాభాల్లోకి వచ్చి, ప్రస్తుతం సూపర్ హిట్ దిశగా ముందుకెళ్తోంది. కానీ సుడిగాలి సుధీర్ కెరీర్ రేంజుకు చాలా పెద్ద విజయమే అనే చెప్పొచ్చు.. ఇది పూర్తిగా సుధీర్ వ్యక్తిగత విజయం అని చెప్పాలి. బుల్లితెర పై తను తెచ్చుకున్న క్రేజ్ కూడా ఈ విజయానికి మరో కారణం. పెద్ద పెద్ద హీరోల సినిమాలు డిజాస్టర్లు అవుతుంటే.. ఒకప్పుడు అనామకుడు అని వెక్కిరింపుకు గురైన సుడిగాలి సుధీర్ హిట్ కొట్టాడు.. ఒకప్పుడు సుధీర్ ను ఎగతాళి చేసిన వారందరికీ గాలోడు సినిమాతో మూతి పగిలే దెబ్బ కొట్టాడు సుడిగాలి సుధీర్..