Sri Reddy : శ్రీ రెడ్డి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని లేని పేరు.. టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమెకు తెలుగు చిత్ర పరిశ్రమంలో చేదు అనుభవం ఎదురయింది. హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో చాలామంది ఈమెను కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులకు గురి చేశారంటూ ఆరోపణలు చేయడంతో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.. కొంతమంది సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు..

తాజాగా శ్రీ రెడ్డి తన ఇంస్టాగ్రామ్ ను ఫాలో అవ్వండి అంటూ ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన అన్ని వీడియోలలోని హాట్ క్లిప్పింగ్స్ ని కలిపి ఓ వీడియో క్రియేట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన చాలామంది శ్రీరెడ్డి ఇంస్టాగ్రామ్ పేజ్ ను చూసి ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఇప్పటికే లక్షల సంఖ్యలో మీకు ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం శ్రీరెడ్డి ఎలాంటి సినిమాలు నటించకుండా చెన్నైలో ఉంటూ ఆమె సొంత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఆ యూట్యూబ్ వీడియోలతో అభిమానులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే యూట్యూబ్ మాత్రమే కాకుండా ఫేస్ బుక్, ట్విట్టర్ , ఇంస్టాగ్రామ్ వంటి వాటిలో ఎంతోమంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా నెలకు భారీగానే సంపాదిస్తుందని తెలుస్తోంది.. తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది.