Sreeleela : మరో యంగ్ హీరోతో రొమాన్స్ కి సిద్ధమైన శ్రీలీల.. కాంబినేషన్ సూపర్ హిట్టే..!

Sreeleela : పెళ్ళిసందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ కన్నడ అందం.. ఈ అమ్మడు అందానికి సినీ ఇండస్ట్రీ మొత్తం ఫిదా అయి పిలిచి మరీ అవకాశాలు ఇస్తోంది ఇప్పటికి పలువురు హీరోలతో సినిమాలకు ఓకే చెప్పేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరో యంగ్ హీరో సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈమె గ్లామర్ ను మాత్రమే నమ్ముకోలేదని .. నటన తోనూ ఆకట్టుకోవాలని చెబుతోంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ రేంజ్ లో ఈమెకు అవకాశాలు రావడానికి మాత్రం దర్శకుడు రాఘవేంద్ర రావు అని తెలిసిన విషయమే.

ఆయన వల్లే ఈమె లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఇకపోతే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వల్లే తనకు ఈ రేంజ్ లో అవకాశాలు అందుతున్నాయి. ఇకపోతే తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటిసారి తనకు అవకాశం ఇచ్చి తనను ఈ స్థాయిలో నిలబెట్టిన రాఘవేంద్రరావు రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని ఎమోషనల్ అయ్యింది. ఇక రవితేజ ధమాకా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక అలాగే బాలయ్య, మహేష్ బాబు, శర్వానంద్, నితిన్ వంటి అగ్ర హీరోల సినిమాలలో కూడా అవకాశాన్ని సొంతం చేసుకుంది.. ఇప్పటికే ఈమె ఖాతాలో క్రేజీ ఆఫర్స్ ఉన్నా ఇప్పుడు మరొక ఆఫర్ కూడా లభించింది.

Sreeleela is ready for romance with another young hero
Sreeleela is ready for romance with another young hero

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఇక ఇప్పటికే బాలయ్య , బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అందుకే బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమాతో భారీ అంచనాలు నెలకొనడంతో ఈ ముద్దుగుమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే మొన్నటి వరకు ఈ సినిమాలో రామ్ సరసన సాక్షి వైద్య కథానాయకగా ఎంపికైందని ప్రచారం జోరుగా సాగింది . కానీ ఇప్పుడు ఆ అవకాశం శ్రీ లీలాకు ఇచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ అమ్మడు లేటుగా వచ్చి విపరీతంగా ఆఫర్లను సొంతం చేసుకుంటోంది అని చెప్పవచ్చు.