Sree Reddy: శ్రీరెడ్డి పరిచయం అక్కర్లేని పేరు.. వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రెండింగ్ టాపిక్ అవుతుంది.. శ్రీ రెడ్డి మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉంటాయో ఎంత పెద్ద దుమారం రేపుతాయో మనందరికీ తెలిసిందే.. ఆమె ఎంతమందిని విమర్శించినా ట్రోల్ చేసిన తను మాత్రం తన విధానాన్ని అస్సలు మార్చుకోదు.. వైసిపి అధినేత జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే ఫేస్బుక్ లైవ్ లోకి వస్తుంది..
విమర్శలు చేసిన వారిపై బూతు పదజాలంతో కడిగేస్తుంది. ఇటీవల జనసేన అధినేత పవన్ పై కూడా అదే చేసింది శ్రీరెడ్డి.. సాధారణంగా పవన్ పై విమర్శలు చేస్తూనే ఉంటుంది.. కానీ మొదటిసారి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచింది.. పవన్ పై వ్యతిరేకంగా మాట్లాడిన అనిల్ రెడ్డిని బూతులతో కడిగిపారేసింది . వైసిపి మద్దతుదారుడిగా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ ఇటీవల పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
పవన్ భార్య, పిల్లలను తనకు అప్పగించాలని అనిల్ నోరు పారేసుకున్నారు. ఈ వీడియో పై శ్రీ రెడ్డి ఘాటుగా స్పందించింది. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ఉన్న అభిమానంతో మనమంతా జగనన్నను నమ్మిన వాళ్లము. అయితే మన పార్టీలో ఉన్న ఒక వెధవ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం గురించి తప్పుగా మాట్లాడాడు. పవన్ ను తిట్టు తప్పులేదు.. కానీ ఆయన భార్య పిల్లలను అనిల్ కుమార్ అనే దరిద్రుడు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్ళ జోలికి వస్తే తాటతీస్తా అంటూ ఫైర్ అయింది శ్రీరెడ్డి.
వైసీపీ పార్టీలో ఉన్న అనిల్ కుమార్ అనే వాడు వైసిపి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. జగన్ నా చొట్టమంటూ దోచుకుంటున్నారు. ఇలాంటి రౌడీ వెధవలను జగనన్న ఎంకరేజ్ చేయడం వీడి గురించి జగనన్నకు చేరవేయండి అంటూ శ్రీరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయింది. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ ని దూషించిన శ్రీ రెడ్డి మొదటిసారి పవన్ కళ్యాణ్ కు ఫేవర్ గా నిలవడంతో శ్రీ రెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో పవన్ ఫ్యాన్స్ కూడా శ్రీ రెడ్డిని లైక్ చేస్తున్నారు.