Sree Leela : పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది శ్రీ లీల.. ఈ బ్యూటీ మొదటి సినిమాతో అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకుంది.. ఆ తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉంది శ్రీలీల.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా తన లేటెస్ట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తుంది.. తాజాగా ఒక నెటిజన్ శ్రీలీల కి చనిపోతా అంటూ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.

శ్రీలీల సంక్రాంతి సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో ట్రెడిషనల్ లుక్ ఫోటో లను పంచుకుంది. దానితో పాటు సంక్రాంతి పండుగను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుందో వివరిస్తూ ఓ షార్ట్ వీడియో ద్వారా అభిమానులతో పంచుకునింది. ఆ వీడియోలో శ్రీలీల బ్లూ కలర్ శారీలో చాలా చక్కగా కుందనపు బొమ్మలా కనిపించింది.. ఈ వీడియోలో శ్రీ లీలను చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
పట్టు చీర కట్టుకున్న మహాలక్ష్మి లా ఉందని కొందరు అంటుంటే.. మరి కొంతమంది ఏమో కుందనపు బొమ్మలా ఉందని.. నువ్వు నాచురల్ బ్యూటీ అంటూ శ్రీ లీల అందం గురించి ఆమె అభిమానులు నేటిజన్స్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ నేటిజన్ శ్రీ లీల ఫోటోలు చూసి విభిన్నంగా స్పందించాడు..
ఓ నెటిజన్ మాత్రం..”నువ్వు ఇలా నీ అందంతో మమల్ని అల్లాడిస్తుంటే.. మేం చస్తే ఆ బాధ్యత నీదే”..అంటూ కొంటెగా గా శ్రీ లీల ను ప్రశ్నించాడు. దాంతో ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీ లీల అందానికి ఎంతమంది ఫాన్స్ ఇలా పిచ్చెక్కిపోతున్నారు ఈ నెటిజన్ పోస్ట్ తో అర్థమయిపోతోంది. యంగ్ బ్యూటీ శ్రీలీలకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు.