Sonu Sood : ఇన్ని సంవత్సరాల తరవాత బయటపడ్డ సోనూ సూద్ ఆస్తులు !

Sonu Sood : ఎన్నో చిత్రాలలో విలన్ పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు సోను సూద్.. సినిమాలలో విలన్ పాత్రలో నటించినప్పటికీ.. నిజజీవితంలో మాత్రం హీరో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కరోనా అని సమయంలో నేనున్నా అంటూ ప్రతి ఒక్కరికి అండగా నిలచాడు.. కొన్ని కొన్ని ప్రాంతాలలో బందీ అయిన వలస కార్మికులను తన సొంత డబ్బులతో వాళ్లని స్వగ్రామాలకు చేర్చాడు సోనూ సూద్..

Advertisement

Advertisement

కరోనా మొదటి, రెండవ దశలో ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టి వారి పాలిట దేవుడిగా మారాడు. ఆ విషయంలో సోను సూద్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంతోమందికి ఆసరాగా నిలిచాడు. ఆ సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి నేనున్నా అంటూ అండగా నిలిచాడు . ప్రత్యేకంగా ఓ యాప్ ను కూడా క్రియేట్ చేసి ఉద్యోగాలు వచ్చేలాగా చేశాడు. అందులో కూడా వెనుకబడిన వారికి ప్రాధాన్యత ఇచ్చాడు.

ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకుని రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఇక ఆయన వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన పంజాబ్లో జన్మించారు. సినిమాలపై ఉన్న మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. పలు భాషలలో నటించి భారీగానే ఆస్తులను కూడా పెట్టారు. కేవలం సినిమాల్లోనే కాకుండా ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ సోనూసూద్ రెండు చేతుల సంపాదిస్తున్నారు.

Sonu Soodh net worth value
Sonu Soodh net worth value

ఈయన ఒక్క సినిమాకి సుమారు రెండు నుంచి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. సోను సూద్ కరోనా సమయంలో విపరీతంగా ఖర్చు పెట్టడం చూసి.. ఆయన ఆస్తి విలువ ఎంత అని నెటిజన్స్ సెర్చ్ చేస్తుండగా.. సోనుసూద్ కి సుమారు 130 కోట్ల ఆస్తి ఉందని సమాచారం. ఇలా ఆయన సంపాదించిన డబ్బులతో ఎంతోమంది పేదవారి అవసరాలను తీరుస్తూ వారికి అండగా నిలిచారు. అంతేకాకుండా చారిటబుల్ ట్రస్టులకు ఆ డబ్బులను అందిస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు.

Advertisement